Share News

Viveka Case: వివేకా హత్య కేసు.. ఆ పిటిషన్‌ని తోసిపుచ్చిన హైకోర్టు

ABN , Publish Date - May 08 , 2024 | 05:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసుపై తాజాగా హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసుపై ఎవరూ మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని అందులో పిటిషనర్..

Viveka Case: వివేకా హత్య కేసు.. ఆ పిటిషన్‌ని తోసిపుచ్చిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసుపై (YS Viveka Case) తాజాగా హైకోర్టులో (AP High Court) ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసుపై ఎవరూ మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని అందులో పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కేసుపై ఎవరూ మాట్లాడొద్దని కడప కోర్టు ఇదివరకే ఆదేశాలు ఇచ్చిందని, అయినా ఖాతరు చేయకుండా అందరూ మాట్లాడుతున్నారని పిటిషనర్ తెలిపారు. అయితే.. ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అసలు ఈ కేసుతో మీకేంటి సంబంధమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అడ్మిషన్ దశలోనే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పిటిషన్‌ని కొట్టివేసింది.

మరీ ఇంత నీచమా.. వివాహేతర సంబంధం కోసం కూతురిని..

ఇదిలావుండగా.. ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) సమీపిస్తున్న తరుణంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని కడప కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాజకీయ పార్టీల ప్రధాన నేతలకు ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే.. ప్రసంగాల్లో భాగంగా రాజకీయ నేతలు వైఎస్ వివేకా హత్య కేసు అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో, ఓ పిటిషనర్ హైకోర్టుని ఆశ్రయించాడు. ఆ పిటిషన్‌పైనే హైకోర్టు మీకేం సంబంధమని మండిపడుతూ.. దాన్ని తిరస్కరించింది.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 08 , 2024 | 05:35 PM