Share News

ప్రతి పల్లెలో సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:35 AM

నియోజకవర్గంలో ప్రతి పల్లెలో సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్‌, సోదరుడు నారాయణ హామీ ఇచ్చారు. సోమవారం మండలంలోని బసినేపల్లి, బసినేపల్లి తండా, లచ్చానిపల్లి గ్రామాలల్లో వారు ప్రచారం చేశారు.

ప్రతి పల్లెలో సమస్యలు పరిష్కరిస్తాం
బసినేపల్లి తండాలో ప్రచారం చేస్తున్న గుమ్మనూరు సోదరుడు

గుత్తిరూరల్‌, ఏప్రిల్‌ 29: నియోజకవర్గంలో ప్రతి పల్లెలో సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్‌, సోదరుడు నారాయణ హామీ ఇచ్చారు. సోమవారం మండలంలోని బసినేపల్లి, బసినేపల్లి తండా, లచ్చానిపల్లి గ్రామాలల్లో వారు ప్రచారం చేశారు. వారు మాట్లడుతూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రం బాగుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. టీడీపీ మండల కన్వీనర్‌ బర్దివలి, చిన్నరెడ్డి యాదవ్‌, దిల్కా శీనా, వీరేష్‌, సర్పుంచు భరత, ఎంపీటీసీ జింకల నారాయణస్వామి, మాజీ సర్పుంచు శ్రీనివాస్‌ చౌదరి, సుధాకర్‌నాయుడు, ఇషాక్‌, గోవర్ధన గౌడ్‌, సుధీర్‌ గౌడ్‌, సాంబ శివ, రవితేజ నారాయణస్వామి ఏంకే చౌదరి, ప్రతాప్‌, గోవిందు, తిరుపాల్‌ పాల్గొన్నారు.


టీడీపీ అభ్యర్థులను గెలిపించండి

గుంతకల్లు: టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గుమ్మనూరు జయరాంకు, అంబికా లక్ష్మినారాయణకు ఓటువేసి గెలిపించాలంటూ టీడీపీ నాయకుడు గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో పట్టణంలో ప్రచారం నిర్వహించారు. స్థానిక 30వ వార్డులో సోమవారం సాయంత్రం టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. టీడీపీకి ఓటువేసి రాషా్ట్రన్ని కాపాడాలని ఓటర్లను కోరారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్‌, తలారి మస్తానప్ప, అంజి, శివన్న, ఉమ పాల్గొన్నారు.


టీడీపీతోనే మైనార్టీల అభ్యున్నతి

పామిడి: తెలుగుదేశం పార్టీతోనే ముస్లిం మైనార్టీల అభ్యున్నతి సాధ్యపడుతుందని కూటమి అసెంబ్లీ అభ్యర్థి జయరాం సోదరుడు నారాయణస్వామి కుమారుడు గుమ్మనూరు మదన అన్నారు. పట్టణంలోని 13, 14, 18వ వార్డులలో సోమవారం ప్రచారం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దాసరి లక్ష్మికాంతమ్మ, గుత్తి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన ప్రభాకర్‌ చౌదరి, మున్సిపల్‌ మాజీ చైర్మన గౌస్‌పీరా, బొల్లు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 30 , 2024 | 12:35 AM