Share News

అవి నకిలీ నవరత్నాలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:30 AM

రాష్ట్రంలో ప్రజలను మరోసారి మోసం చేయడానికి నకలీ నవ రత్నాలు-2 మ్యా నిఫెస్టోను సీఎం జగన విడుదల చేశార ని కూటమి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరాసా నాయు డు, ముంటిమడుగు కేశవరెడ్డి అన్నారు.

అవి నకిలీ నవరత్నాలు
Bandaru Sravanisree speaking in Venkatapuram

బుక్కరాయసముద్రం, ఏప్రిల్‌ 28: రాష్ట్రంలో ప్రజలను మరోసారి మోసం చేయడానికి నకలీ నవ రత్నాలు-2 మ్యా నిఫెస్టోను సీఎం జగన విడుదల చేశార ని కూటమి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరాసా నాయు డు, ముంటిమడుగు కేశవరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటాపురం, సంజీపురం, దయ్యాల కుంటపల్లి, పసు లూరు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. టీడీపీ విడుదల చేసిన సూప ర్‌సిక్స్‌ పథకాల ముందు జగన విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో వెలవెల పోయిందన్నారు. పింఛన జగన నాలుగు సంవత్సరాలకు గాను రూ.3500 ఇస్తే.... చంద్ర బాబు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు రుపాయులు ఇస్తార న్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా టీడీపీ మ్యానిఫెస్టో ఉందన్నారు. టీడీపీని గెలిపిస్తే... నిరంతరం అందుబాటలో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. వైసీపీను గెలిపిస్తే.... గ్రామాల్లో ఇసుక, మట్టిని దోచుకుని కోట్లు గడిస్తారన్నారు. నిత్యావసర ధరలు తగ్గాలంటే టీడీపీకు ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షుడు పసుపుల హనుమంతురెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్‌బాబు, కన్వీనర్‌ అశోక్‌, టీడీపీ నేతలు పాల్గొన్నారు.


గ్రామాల్లో టీడీపీ విస్తృత ప్రచారం

గార్లదిన్నె : శింగనమల నియోజక వర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటి మడుగు కేశవరెడ్డి, బండారు శ్రావణి శ్రీ సోదరి బండారు కిన్నెర శ్రీ ఆదివారం మండలంలోని కమలాపురం, కొట్టాల పల్లి, కొప్పలకొండ గ్రామాల్లో స్థానిక నాయకులతో కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కిష్టయ్య, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి రా మాంజి, వడ్డేర సమితి జిల్లా అధ్యక్షుడు వన్నూర్‌, మాజీ సర్పంచు పుల్లన్న, టీఎనటీ యూసీ జిల్లా అధికార ప్రతినిధి బాబయ్య పాల్గొన్నారు.

శింగనమల: మండలంలోని గురుగుంట్లలో టీడీపీ మండల నాయకులు ప్రచారం నిర్వహిం చారు. ఇందులో మండల టీడీపీ కన్వీనర్‌ ఆదినారాయణ, రాష్ట్ర తెలుగు యువత అధికారి ప్రతినిధి దండు శ్రీనివాసులు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, చితంబరిదొర, కుళ్లాయప్ప పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 29 , 2024 | 12:30 AM