Share News

DONKEYS : గాడిదలపై పరుగులు

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:40 AM

వజ్రకరూరులో జనార్దన వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని పురష్కరించుకునిగాడిదల పరుగు పోటీలను సోమవారం నిర్వహించారు. రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పోటీలో ఎనిమిది గాడిదలు పాల్గొనగా, మురిడికి చెందిన తిప్పేస్వామి ..

DONKEYS : గాడిదలపై పరుగులు
Who will come first..

ఉరవకొండ, ఏప్రిల్‌ 29: వజ్రకరూరులో జనార్దన వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని పురష్కరించుకునిగాడిదల పరుగు పోటీలను సోమవారం నిర్వహించారు. రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పోటీలో ఎనిమిది గాడిదలు పాల్గొనగా, మురిడికి చెందిన తిప్పేస్వామి గాడిద మొదటి బహుమతి దక్కించుకుంది. రాయదుర్గం మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన మల్లేష్‌ గాడిద రెండో స్థానం దక్కించుకుంది. మొదటి బహుమతి రూ.10వేలు, రెండో బహుమతి రూ.8 వేలను నిర్వాహకులు సురేంద్ర, గురుస్వామి, సురే్‌ష అందజేశారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 30 , 2024 | 12:40 AM