Share News

టీడీపీతోనే ప్రజాసంక్షేమం

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:58 PM

టీడీపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని హిందూ పురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పేర్కొన్నారు. ఆమె సోమవారం మండలంలో మూడోరోజు రోడ్‌షో నిర్వహించారు.

టీడీపీతోనే ప్రజాసంక్షేమం
రాగి పంట కోస్తున్న వసుంధరాదేవి

బాలయ్యకు ఓటేస్తేనే

పురం అభివృద్ధి: వసుంధరాదేవి

రోడ్‌షోలో ప్రజల నీరాజనం

చిలమత్తూరు, ఏప్రిల్‌ 15: టీడీపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని హిందూ పురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పేర్కొన్నారు. ఆమె సోమవారం మండలంలో మూడోరోజు రోడ్‌షో నిర్వహించారు. ఉదయం 8 గంటలకే మరవకొత్తపల్లి నుంచి రోడ్‌షో ప్రారంభించారు. అక్కడి నుంచి లక్ష్మీ పురం, వెంకటాపురం, వీరాపురం, హుసేనపురం, భూప సముద్రం, ఆదెప్పల్లి, పాతచామలపల్లి, సంజీవ రా యునిపల్లి, చిలమత్తూరులో భారీ జనసందోహం మధ్య న రోడ్‌షో సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ... ప్రజా సంక్షేమం కోసమే టీడీపీ ఆవిర్భవించిందన్నారు. ఇతర పార్టీలు సంక్షేమం పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నాయని, వైసీపీ ఉత్తుత్తి హామీలతో ఐదేళ్లుగా ప్రజలు మోస పోతున్నారన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమంతోపాటు రాజకీయ, ఆర్థిక, సామాజి క న్యాయం జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. బాలయ్యతోనే హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి సాధ్య మన్నారు. ఆయన నిత్యం పురం ప్రజల గురించే ఆలోచిస్తారన్నారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసీ ఎమ్మెల్యేగా బాలయ్యను, ఎంపీగా పార్థసారఽథిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ రోడ్‌షోలో మహిళలు వసుంధర దేవికి అడుగడుగునా హారతులు పట్టారు. యువతులు, వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరు ఆమెతో కరచాలనం చేయడానికి ఎగబడ్డారు.

టీడీపీలోకి చేరిక : రోడ్‌షోలో భాగంగా వెంకటాపురానికి వెళ్లిన వసుంధరాదేవి అక్కడ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ స్థానిక నాయకులు రఘువర్ధనరెడ్డి ఆధ్వ ర్యంలో పలు వైసీపీ కుటుంబాలు వసుంధర సమక్షం లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సోదరి లోకేశ్వరి, నాయకులు శ్రీనివాసు, కోఆర్డినేటర్‌ శ్రీనివాసులు, డాక్టర్‌ సురేంధ్ర, ఐటీ ప్రొఫెషనల్‌ వింగ్‌ ప్రతినిధి తేజశ్విని, స్థానిక నాయకులు రంగారెడ్డి, దేమకేతేపల్లి అంజనప్ప, టీడీపీ ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి బేకరీ గంగాధర్‌, రఘువర్ధనరెడ్డి, గంగప్ప, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆమె వెంకటా పురం సమీపంలో రోడ్డు పక్కన ఎర్రటి ఎండలో రాగి పంట కోస్తున్న కూలీల వద్దకు వెళ్లి మాట్లాడారు. వారి కష్ట సుఖాలు తెలుసుకున్నా రు. టీడీపీ అధికారంలోకి రాగానే పేదలను ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. కూలీలతో కలిసి ఆమె కొడవలి చేతబట్టి రాగి పంట కోసారు.

Updated Date - Apr 15 , 2024 | 11:58 PM