Share News

ఓపీకి ఉక్కపోత

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:35 AM

జిల్లా సర్వజన ఆసుపత్రిలో వైద్యం ఆ దేవుడెరుక. ఇక్కడికి వచ్చిన రోగులకు ఓపీ చీటి దొరకడమే గగనమై పోతోంది.

ఓపీకి ఉక్కపోత

అనంతపురం టౌన : జిల్లా సర్వజన ఆసుపత్రిలో వైద్యం ఆ దేవుడెరుక. ఇక్కడికి వచ్చిన రోగులకు ఓపీ చీటి దొరకడమే గగనమై పోతోంది. అసలే ఎండాకాలం. ఎండలు విపరీతంగా మండిపోతుండడంతో ఉక్కపోత జనాన్ని అల్లాడిస్తోంది. సోమవారం ఆసుపత్రికి వందలమంది రోగులు చికిత్స కోసం వచ్చారు. ఇక్కడ ఓపీ కేంద్రాల వద్ద రోగులు బారులుతీరారు. పైన రేకులు షెడ్డు ఉండడంతో ఎండ వేడిమికి ఓపీ కేంద్రాలలో ఉన్న రోగులు ఉక్కపోతకు తట్టుకోలేక నానా అవస్థలు పడ్డారు. ఈ రోగం పోయి.. ఇంకో రోగం వచ్చేలా ఉంది దేవుడో అని అల్లాడిపోయారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 30 , 2024 | 12:36 AM