Share News

ప్రభాకర్‌ చౌదరికి పలువురి శుభాకాంక్షలు

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:55 PM

మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు

ప్రభాకర్‌ చౌదరికి పలువురి శుభాకాంక్షలు
ప్రభాకర్‌ చౌదరికి శుభాకాంక్షలు తెలుపుతున్న దగ్గుబాటి ప్రసాద్‌

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 15 : మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఆయన నివాసానికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్‌ వెళ్లి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్‌ నేతకు పార్టీ సముచిత స్థానం కల్పించిం దన్నారు. ప్రభాకర్‌ చౌదరి సహకారంతో ఈ ఎన్నికల్లో అనంత అర్బనలో టీడీపీ జెండాను ఎగురవేస్తామన్నారు. అలాగే వైకుంఠంకు మేయర్‌ గంపన్న, టీడీపీ నాయకులు డిష్‌ నాగరాజు, దేవళ్ల మురళి, సరిపూటి రమణ, నటేష్‌ చౌదరి, మారుతీకుమార్‌ గౌడ్‌, కుంచెపు వెంకటేష్‌, పీఎం లక్ష్మీప్రసాద్‌, బంగి నాగ, గోపాల్‌ గౌడ్‌, బాలప్ప, అజీజ్‌, చేపల హరి, గంగవరం అంజి, డిస్కో బాబు, రాయల్‌ రఘునాథ్‌, మన్సూర్‌ అలీ, బొమ్మినేని శివ, జేఎం బాషా, పూల బాషా, తెలుగు మహిళలు స్వప్న, విజయశ్రీరెడ్డి, సరళ, మణెమ్మ, వసుంధర, హసీనా, దళిత సంఘాల నాయకులు నారాయణస్వామి, చెన్నకేశవులు, సత్యకుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Apr 15 , 2024 | 11:55 PM