ACCIDENT : మావయ్యా.. నేనూ వస్తా..!
ABN , Publish Date - May 03 , 2024 | 01:50 AM
తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన తమిద్‌మారన ఆ రో తరగతి చదువుతున్నాడు. బడికి వేసవి సెలవులు వచ్చాయి. తన మేన మామ విజయ్ క్యాంటర్ వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సరుకు రవాణా కోసం వివిధ ప్రాంతాలకు వెళు తుంటాడు. మేనల్లుడికి మామ వెంట వెళ్లి ఊళ్లన్నీ తిరగాలనినిపించింది. ‘మామా.. మా మా.. నేనూ వస్తా నీ వెంట..’ అని గోముగా అడిగాడు. బహుషా తను.. ‘వద్దురా.. ఎండలకు తట్టుకోలేవు..’ అని సముదాయించి ఉంటాడు. ముద్దుల మేనల్లుడు బుంగమూతి పెట్టగానే.. చెల్లెకి నచ్చజెప్పి వెంట తీసుకెళ్లింటాడు.
మేనల్లుడి వేసవి విహారయాత్ర విషాదాంతం
ఆగివున్న సిమెంటు లారీని ఢీకొన్న వ్యాన
తమిళనాడుకు చెందిన మామ.. మేనల్లుడి మృతి
పెనుకొండ రూరల్, మే 2: తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన తమిద్‌మారన ఆ రో తరగతి చదువుతున్నాడు. బడికి వేసవి సెలవులు వచ్చాయి. తన మేన మామ విజయ్ క్యాంటర్ వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సరుకు రవాణా కోసం వివిధ ప్రాంతాలకు వెళు తుంటాడు. మేనల్లుడికి మామ వెంట వెళ్లి ఊళ్లన్నీ తిరగాలనినిపించింది. ‘మామా.. మా మా.. నేనూ వస్తా నీ వెంట..’ అని గోముగా అడిగాడు. బహుషా తను.. ‘వద్దురా.. ఎండలకు తట్టుకోలేవు..’ అని సముదాయించి ఉంటాడు.
ముద్దుల మేనల్లుడు బుంగమూతి పెట్టగానే.. చెల్లెకి నచ్చజెప్పి వెంట తీసుకెళ్లింటాడు. అలా వారి ప్రయాణం.. అమరపురిదాకా కొనసాగింది. అత్యంత విషాదకరంగా మేనల్లుడు, మేనమామ మృత్యువాత పడ్డారు. పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ఆగి ఉన్న సిమెంటు లారీని వారి క్యాంటర్ వాహనం ఢీకొట్టింది. 44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘో ర ప్రమాదంలో డ్రైవర్ విజయ్(29), అతని మేనల్లుడు తమిద్‌మారన(11) మృతిచెందారని కియ పోలీ్‌సస్టేషన ఎస్‌ఐ రంగడు తెలిపారు. క్యాంటర్ వాహనంలో తిరువన్నామలై నుంచి పండ్లు తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లి అనలోడ్ చేశారు.
అక్కడి నుంచి తుక్కును (స్ర్కాప్) తీసుకుని బెంగళూరులో అనలోడ్ చేసేందుకు బయలుదేరాడు. గుట్టూరు సమీపంలో వేకువజామున జాతీయ రహదారి పక్కన ఆగివున్న సిమెంటు లారీని గమనించక బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్ర భుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు గురువా రం రాత్రికి పెనుకొండ వచ్చారు. ఇద్దరి మృతితో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....