Share News

జగనరెడ్డి... నీ దొంగ హామీలు ప్రజలు నమ్మరు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:28 AM

జగనరెడ్డి... నీ దొంగ హామీలు ప్రజలు నమ్మరని అనంత అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాజీవ్‌ చిల్డ్రన పార్కు, ఇండోర్‌ స్టేడియంలో ప్రచారం నిర్వహించారు.

 జగనరెడ్డి... నీ దొంగ హామీలు ప్రజలు నమ్మరు
రామకృష్ణ కాలనీలో వృద్ధురాలితో మాట్లాడుతున్న దగ్గుబాటి ప్రసాద్‌

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 28: జగనరెడ్డి... నీ దొంగ హామీలు ప్రజలు నమ్మరని అనంత అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాజీవ్‌ చిల్డ్రన పార్కు, ఇండోర్‌ స్టేడియంలో ప్రచారం నిర్వహించారు. అక్కడి వాకర్స్‌తో కలిసి కొద్దిసేపు వ్యాయామం చేశారు. ఇండోర్‌ స్టేడియంలో సెటిల్‌ ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. స్టేడియం, పార్కుల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీసం తాగునీరు కూడా లేకుండా చేశారని కొందరు వాపోయారు. దగ్గుబాటి ప్రసాద్‌ మాట్లాడుతూ... అనంతపురానికి సంబంధించి సీఎం జగన, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఒక్క హామీని కూడా నేరవేర్చలేదన్నారు. చంద్రబాబును గెలిపించేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. అనంతపురం రూరల్‌ పంచాయతీ పరిధిలోని రామకృష్ణ కాలనీలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.


బాబును మళ్లీ సీఎం చేద్దాం

చంద్రబాబును మళ్లీ సీఎంగా చేద్దామని, ఇది రాష్ర్టానికి.. ప్రజల సంక్షేమానికి ఎంతో అవసరమని దగ్గుబాటి ప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన మాటలు.. ఆయన చేసే పనులు వెన్నపూసిన కత్తిలా ఉంటాయని.. అది ప్రజలకు తగిలే వరకు అర్థం కాదన్నారు. జగన ప్రభుత్వంపై యువత, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నారు.


కొనసాగిన చేరికలు..

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగాయి. ఆదివారం 33వ డివిజన నాయక్‌ నగర్‌లో దగ్గుబాటి ప్రసాద్‌, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణలు ప్రచారం చేశారు. ఇదే సమయంలో మాజీ డిప్యూటీ మేయర్‌ గంపన్న ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. అలాగే మారుతీ నగర్‌కు చెందిన పలువురు టీడీపీలో చేరారు.


దగ్గుబాటి శ్రీ లక్ష్మీ ప్రచారం

దగ్గుబాటి సతీమణి దగ్గుబాటి శ్రీ లక్ష్మీ స్థానిక 21, 32 డివిజన్ల పరిధిల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 13వ డివిజనలో టీడీపీ కురబ సాఽధికార సమితి రాష్ట్ర డైరెక్టర్‌ కురబ నారాయణస్వామి, తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని, యూనిట్‌ ఇనచార్జి చెరుకూరి శివ, స్థానిక 35, 36వ డివిజనల్లో మాజీ కార్పొరేటర్‌ రాజారావు, 20వ డివిజనలో టీడీపీ డాక్టర్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పీఎం లక్ష్మీప్రసాద్‌, 11వ డివిజనలో యూనిట్‌ ఇనచార్జి విజయ్‌కుమార్‌, మంజునాథ్‌, రాజేశ్వరి, బోయ మంజులు ప్రచారం చేశారు.


గ్రామాల్లో టీడీపీ ప్రచారం

అనంతపురంరూరల్‌: కూటమి అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌, పార్లమెంట్‌ అభ్యర్థి అంబిక లక్ష్మినారాయణను గెలిపిం చాలని టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహిం చారు. మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ తపోవనంలో రాష్ట్ర కాపు కార్పొరే షన డైరెక్టర్‌ రాయల్‌ మురళీ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులతో కలసి ప్రచారం నిర్వహించారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 29 , 2024 | 12:28 AM