Share News

వైసీపీకి దిమ్మతిరిగేలా బుద్ధిచెప్పండి

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:55 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓటువేసి వైసీపీకి దిమ్మతిరిగేలా బుద్ధిచెప్పాలని ఎమ్మెల్యే అభ్యర్థి గు మ్మనూరు జయరాం ఓటర్లను కోరారు.

వైసీపీకి దిమ్మతిరిగేలా బుద్ధిచెప్పండి
మాట్లాడుతున్న గుమ్మనూరు జయరాం

కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం

గుంతకల్లు, ఏప్రిల్‌15: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓటువేసి వైసీపీకి దిమ్మతిరిగేలా బుద్ధిచెప్పాలని ఎమ్మెల్యే అభ్యర్థి గు మ్మనూరు జయరాం ఓటర్లను కోరారు. సోమవారం సాయంత్రం మండలంలోని ఎన తిమ్మాపురం గ్రామంలో టీడీపీ నాయకులు ప్రజాగళం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జయరాం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేతగానితనం, జగన స్వార్థం కారణంగా రాష్ట్రం అధోగతి చెందిందన్నారు. ఎక్కడచూసినా కబ్జాలు, ఇసుక దందాలతో దోపిడీ చేశారన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌, నాయకులు కేసీ హరి, గుమ్మనూరు వెంకటేశులు, తలారి మస్తానప్ప, పత్తి హిమబిందు, ఓ రామాంజనేయులు, మహదేవ్‌ పాల్గొన్నారు.

గుత్తి: సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన రెక్కలు ఊడి కింద పడటం ఖాయమని గుమ్మనూరు జయరాం అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ ఆధ్వర్యంలో స్ధానిక సితార ఫంక్షన హల్‌లో సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా నష్టపోయారన్నారు. బండారు ఆనంద్‌, గుమ్మనూరు నారాయణ, గాజులపల్లి హనమంతరెడ్డి, న్యాయవాది సోమశేఖర్‌, సుధాకర్‌నాయుడు, పాటిల్‌ సురేష్‌ పాల్గొన్నారు.

ఎవరు అక్రమార్కులో గుర్తించండి

పామిడి: గుంతకల్లు నియోజకవర్గంలో ఎవరు అక్రమార్కులో గుర్తించాలని, తనపైన ఆలూరు నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని గుమ్మనూరు జయరాం అన్నారు. పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలోని కల్యాణ వేదికలో సోమవారం రాత్రి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... వైసీపీ తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఇందులో వాస్తవాలు ఏ మిటో మీరే ఆలూరు నియోజకవర్గంలో విచారించుకోవచ్చన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిరణ్‌గౌడ్‌, టీడీపీ డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ పత్తి హిమబిందు, మాజీ జడ్పీటీసీ దాసరి లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు.

వంద కుటుంబాలు చేరిక: పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీ, నారాయణస్వామివీధి(సంతమార్కెట్‌)లో వంద కుటుంబాలు సోమవారం రాత్రి జయ రాం సమక్షంలో టీడీపీలోకి చేరాయి. ముందుగా 44వ జాతీయ రహదారిలో 4వ వార్డు ఇనచార్జి రవి ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు.

Updated Date - Apr 15 , 2024 | 11:55 PM