Share News

‘శ్రీరామిరెడ్డి’ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:57 PM

శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల బకాయి వేతనాలు, పీఎఫ్‌ను వెంటనే చెల్లించాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.

‘శ్రీరామిరెడ్డి’ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలి
నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు, కార్మికులు

అనంతపురం కల్చరల్‌, ఏప్రిల్‌ 15: శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల బకాయి వేతనాలు, పీఎఫ్‌ను వెంటనే చెల్లించాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. కార్మికుల వేతనాల్లో కోత విధించడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ శివశంకర్‌రెడ్డి రాయదుర్గం, కళ్యాణదుర్గం కార్మికులకు రావాల్సిన వేతనంలో ఒక్కొక్కరి నుంచి రూ.2వేలు కోత విధించడంతో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి వాటర్‌ సప్లయ్‌ స్కీమ్‌లో ఫేస్‌-4 రాయదుర్గం, కళాణదుర్గం కార్మి కులు గత 15 సంవత్సరాలుగా 600 గ్రామాల ప్రజలకు 280 మంది కార్మికులు నిరంతరం తాగునీరం దిస్తున్నారన్నారు. వీరికి 2022 నుంచి కాంట్రాక్టర్‌ శివారెడ్డి రూ.16,500 వేతనం, రూ.1,500 పీఎఫ్‌తో కలిపి మొత్తం 18వేలు ఇచ్చేవారన్నారు. ప్రస్తుత కాంట్రాక్టర్‌ శివశంకర్‌ రెడ్డి కేవలం రూ.14,250 మాత్రమే వేతన మిస్తున్నాడని, పీఎఫ్‌ కట్టడం లేదని పేర్కొన్నారు. వేతనం కూడా ఈనెల 12న కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో చెల్లించాడని పేర్కొన్నారు. అందు లోనూ 20 మంది కార్మికులకు ఇప్పటికీ వేతనాలు జమ చేయలేదని తెలిపారు. కాంట్రా క్టర్‌ శివశంకర్‌రెడ్డికి ఎలాంటి అనుభవమూ లేదని, అందువల్లనే కార్మికుల గోడు ఆయనకు పట్టలే దని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ఆ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకో వాలని, కార్మికులకు ఎలాంటి కోతలు లేకుండా పూర్తి వేతనం చెల్లించి, పీఎఫ్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఆర్‌ఓ రామకృ ష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్ర మంలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం యూని యన జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్యదర్శి రాము, ఒన్నూరుస్వామి, నరేష్‌, అశోక్‌, రమేష్‌, ప్రకాష్‌, చిత్తప్ప, రాందాస్‌, శివ పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:57 PM