Share News

AP High Court: సంక్షేమ హాస్టళ్లలో బెడ్ల ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-08T22:28:24+05:30 IST

సంక్షేమ హాస్టళ్లలో బెడ్ల ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు బెడ్లు ఏర్పాటు చేయలేమా అని ధర్మాసనం ప్రశ్నించింది. మనం ఏటువంటి సమాజంలో బతుకుతున్నాం అని హైకోర్టు ప్రశ్నించింది.

AP High Court: సంక్షేమ హాస్టళ్లలో బెడ్ల ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: సంక్షేమ హాస్టళ్లలో బెడ్ల ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు బెడ్లు ఏర్పాటు చేయలేమా అని ధర్మాసనం ప్రశ్నించింది. మనం ఏటువంటి సమాజంలో బతుకుతున్నాం అని హైకోర్టు ప్రశ్నించింది. క్రింద పడుకోవాల్సిన పరిస్థితి ఉంటే మన పిల్లలను చేర్పిస్తామా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

పిల్లలకు వెంటనే బెడ్స్ ఏర్పాటు చేయాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా గొడి గ్రామంలో హాస్టల్ లో వసతులపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని హైకోర్ట్ స్పష్టం చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2023-11-08T22:30:38+05:30 IST