Share News

షోరూంకు తరలిస్తున్న బైక్‌లు దగ్ధం

ABN , Publish Date - May 05 , 2024 | 12:09 AM

షోరూంకు తరలిస్తున్న నాలుగు బైక్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన పూడూరు మండల పరిధిలో చోటుచేసుకుంది.

షోరూంకు తరలిస్తున్న బైక్‌లు దగ్ధం
ఐచర్‌ వాహనంలో దగ్ధమవుతున్న బైక్‌లు

పూడూరు, మే 4: షోరూంకు తరలిస్తున్న నాలుగు బైక్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన పూడూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాండూరు వైష్టవి షోరూం నుంచి కొండాపూర్‌, గచ్చిబౌలిలోని వైష్టవి హోండా షోరూంకు రెండు హోండా షైన్‌, రెండు యూనికార్న్‌ బైక్‌లను ఐచర్‌ వాహనంలో తరలిస్తున్నారు. మార్గమధ్యలో వాహనంలోని నాలుగు బైక్‌లు తగలబడ్డాయి. వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు.

Updated Date - May 05 , 2024 | 12:09 AM