Share News

బీజేపీ వస్తే రాజ్యాంగం మార్చుతారట

ABN , Publish Date - May 05 , 2024 | 12:09 AM

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చుతారట అని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. శనివారం షాబాద్‌లో భారీ రోడ్‌షో నిర్వహించి, ఎంఎస్‌ గార్డెన్‌లో సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశానికి పదేళ్లుగా బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ చేసిన దోపిడీని, చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓటు ద్వారా తరిమికొట్టాలన్నారు.

బీజేపీ వస్తే రాజ్యాంగం మార్చుతారట
షాబాద్‌ : రోడ్‌షోలో రంజిత్‌రెడ్డిని గజమాలతో సన్మానిస్తున్న అభిమానులు, కార్యకర్తలు

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి

షాబాద్‌/చేవెళ్ల, మే 4 : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చుతారట అని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. శనివారం షాబాద్‌లో భారీ రోడ్‌షో నిర్వహించి, ఎంఎస్‌ గార్డెన్‌లో సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశానికి పదేళ్లుగా బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ చేసిన దోపిడీని, చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓటు ద్వారా తరిమికొట్టాలన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డికి వేల కోట్ల ఆస్తులు ఉన్నా.. ఏం లాభమని, ప్రజలకు అందుబాటులో ఉండడని, కార్యకర్తలనే గుర్తుపట్టడని ఆరోపించారు. కాంగ్రెస్‌ గెలుపుతోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. భారీ మెజార్టీతో గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానన్నారు. చేవెళ్ల సమగ్రాభివృద్ధికి పాటుపడతానన్నారు. భీంభరత్‌, పీసీబీ మెంబర్‌ సత్యనారాయణరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శులు సురేందర్‌రెడ్డి, రాంరెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు

షాబాద్‌ మండలం సర్దార్‌నగర్‌, మన్‌మర్రి, బోడంపహాడ్‌, ఏట్లఎర్రవల్లి, లింగారెడ్డిగూడ తదితర గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు కాంగ్రె్‌సలో చేరారు. రంజిత్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డిలు చేవెళ్ల మండలం మీర్జగూడ, బస్తేపూర్‌, దామరిగిద్ద తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. 30 ఏళ్లుగా మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని మోసం చేస్తున్న మందకృష్ణ.. మాదిగ జాతి ద్రోహి అని తెలంగాణ రాష్ట్ర మాదిగ సంఘాల మహాకుటమి చైర్మన్‌ కిరణ్‌కుమార్‌ మాదిగ అన్నారు. చేవెళ్లలోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల్లో పదవులు అనుభవించిన మోత్కుపల్లి నర్సింహులు మోసం చేశారన్నారు.

కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి : స్పీకర్‌

మోమిన్‌పేట్‌ : కాంగ్రె్‌సతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అన్నారు. ఆయన సమక్షంలో మోమిన్‌పేట్‌ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు మండలాధ్యక్షుడు మన్నె శంకర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో స్పీకర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీపీ శివకుమార్‌స్వామి, మండల మాజీ అధ్యక్షుడు విఠల్‌, 60 మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలున్నారు.

రంజిత్‌రెడ్డిని గెలిపించాలి : అనితారెడ్డి

మహేశ్వరం/కందుకూరు/, మే 4 : రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి అన్నారు. మహేశ్వరం పట్టణ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రంజిత్‌రెడ్డిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. పీసీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, కందుకూరు మండలాధ్యక్షుడు కృష్ణానాయక్‌ల ఆధ్వర్యంలో కొత్తగూడ, జైత్వారం, పులిమామిడి, పెద్దమ్మతాండ, మీర్కాన్‌పేట నుంచి బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన 80మంది కాంగ్రె్‌సలో కేఎల్లార్‌ సమక్షంలో చేరారు. మండల కేంద్రం, జబ్బార్‌గూడలో ప్రయాణికులను జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి ఓట్లు అడిగారు. కాగా, దేశం కోసం ప్రాణ త్యాగం చేయడంతో పాటు ప్రధాని పదవులను కూడా తృణప్రాయంగా వదులుకున్న చరిత్రగల కుటుంబం రాహుల్‌ గాంధీదని, బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు దేశం కోసం ఏం వదలుకున్నారో చూపించాలని పీసీసీ అధికార ప్రతినిధి బోద మాధవరెడ్డి అన్నారు. మహేశ్వరంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రంజిత్‌రెడ్డిని గెలవడం ఖాయమన్నారు.

రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

కులకచర్ల/యాలాల/వికారాబాద్‌/పెద్దేముల్‌/పూడూరు/ధారూరు/తాండూరురూరల్‌/పరిగి : రంజిత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కోరారు. కులకచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. కులకచర్ల పీజేఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన గిరిజన, ఆదివాపీ బంజార తాలూకా స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రంజిత్‌రెడ్డిని గెలిపించాలని వికారాబాద్‌ జిల్లా కోఆప్షన్‌ సంఘం అధ్యక్షులు అక్బర్‌ బాబా యాలాల మండల కేంద్రంలో ప్రచారం చేశారు. రంజిత్‌రెడ్డిని గెలిపించాలని వికారాబాద్‌ పట్టణాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మునిసిపల్‌ పరిధి ధన్నారంలో ప్రచారం చేశారు. రంజిత్‌రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కోరారు. పెద్దేముల్‌ మండల కేంద్రంలో ప్రచారంలో పాల్గొన్నారు. జడ్పీటీసీ ధారాసింగ్‌, తదితరులున్నారు. రంజిత్‌రెడ్డిని గెలిపించుకుందామని పూడూరు మండల కాంగ్రెస్‌ నాయకులు పెద్దఉమ్మెంతాల్‌లో ప్రచారం చేశారు. రంజిత్‌రెడ్డి తనయుడు ఆర్యన్‌రెడ్డి ధారూరు మండలం అల్లీపూర్‌లో పర్యటించి ప్రచారం చేశారు. జాతీయ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సంతో్‌షకుమార్‌, నాయకులున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్‌ ఆధ్వర్యంలో ధారూరు మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రంజిత్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. తాండూరు మండలం కరన్‌కోట్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ యువ నాయకులు మాజీ ఎంపీపీ శరణుబసప్ప, తుపాకుల బసప్ప ఆధ్వర్యంలో తాండూరులో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ఆదివాసీ, గిరిజనులు కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని పీసీసీ ఆదివాసీ, కాంగ్రెస్‌ స్టేట్‌ చైర్మన్‌ తేజావత్‌ బెలయ్యనాయక్‌ కోరారు. కులకచర్లలో నియోజకవర్గస్థాయి గిరిజనుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ నివాసంలో వికారాబాద్‌ మునిసిపాలిటీకి చెందిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, సీనియర్‌ నాయకులు పట్టణాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి పరిగి మార్కెట్‌లో వ్యాపారులు, రైతులను కలిసి అభ్యర్థించారు. చౌడాపూర్‌ మండలం మందిపల్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Updated Date - May 05 , 2024 | 12:09 AM