Share News

శతాధిక వృద్ధురాలు.. అందరికీ ఆదర్శం

ABN , Publish Date - May 05 , 2024 | 12:10 AM

జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం తుమ్మలపల్లికి చెందిన శతాధిక వృద్ధురాలు హోం ఓటింగ్‌ ద్వారా ఓటుహక్కును వినియోగించుకుంది.

శతాధిక వృద్ధురాలు.. అందరికీ ఆదర్శం

వంద ఏళ్లు దాటినా.. బాధ్యతగా ఓటుహక్కు వినియోగం

చౌదరిగూడ, మే 4: జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం తుమ్మలపల్లికి చెందిన శతాధిక వృద్ధురాలు హోం ఓటింగ్‌ ద్వారా ఓటుహక్కును వినియోగించుకుంది. శనివారం ఎన్నికల సిబ్బంది వయో పరిమితి 80 ఏళ్లు పైబడిన వారందరితో ఓటు వేయించుకున్నారు. దాదాపు 120 ఏళ్లు ఉన్న వృద్ధురాలు పిట్ట వెంకమ్మ ఫారం 12 ద్వారా ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకుంది. పోలింగ్‌ అధికారి సత్యమ్మ ఆమె ఇంటికి వెళ్లి బ్యాలెట్‌ పత్రాన్ని అందజేశారు. కుటుంబసభ్యుల సహకారంతో తనకు నచ్చిన పార్టీ/అభ్యర్థికి ఓటువేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - May 05 , 2024 | 12:10 AM