Share News

ఇంటివద్ద ఓటింగ్‌ ప్రారంభం

ABN , Publish Date - May 04 , 2024 | 11:50 PM

భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి శనివారం చౌటుప్పల్‌ మండలంలో హోం ఫర్‌ ఓటింగ్‌ను ప్రారంభమైంది.

ఇంటివద్ద ఓటింగ్‌ ప్రారంభం

మొదటి రోజు 21 మంది ఓటు హక్కు వినియోగం

చౌటుప్పల్‌ టౌన, మే 4: భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి శనివారం చౌటుప్పల్‌ మండలంలో హోం ఫర్‌ ఓటింగ్‌ను ప్రారంభమైంది. ఆనలైనలో ధరఖాస్తు చేసుకున్న 85 సంవత్సరాలు నిండిన వృద్ధులతో పాటు దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన కల్పించింది. మునిసిపాలిటీతో పాటు మండలంలో 41మందికి ఈ అవకాశాన్ని కల్పించారు. మొదటి రోజు మునిసిపాలిటీలోని చౌటుప్పల్‌, తాళ్ల సింగారం, మండలంలోని కుంట్లగూడెం, ఆరెగూడెం, అంకిరెడ్డిగూడెంలలోని 21 మంది ఓటర్లు బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తహసీల్దార్‌ హరికృష్ణ, మండల ఎన్నికల అధికారి శ్రీనివాస్‌, ఆర్‌ఐ సుధాకర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:50 PM