Share News

‘పోలింగ్‌’లో సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకం

ABN , Publish Date - May 04 , 2024 | 11:27 PM

పోలింగ్‌ ప్రక్రియలో సెక్టార్‌ అధికారు ల పాత్ర అత్యంత కీలకమని, వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అన్నారు.

‘పోలింగ్‌’లో సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకం

కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే

భువనగిరి అర్బన్‌, మే 4: పోలింగ్‌ ప్రక్రియలో సెక్టార్‌ అధికారు ల పాత్ర అత్యంత కీలకమని, వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం భువనగిరి లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సెక్టార్‌ అధికారుల అవగాహన కా ర్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులు తాగునీరు, లైటింగ్‌, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, మెడికల్‌ కిట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, వీల్‌చైర్లు, సరైన విద్యుత్‌ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెబ్‌క్యాస్టింగ్‌ లేఅవుట్‌ ప్రకారం సరి చూ సుకోవాలని, ఓటు గోప్యతను కాపాడాలని, పోలింగ్‌ కేంద్రంలోకి గుం పులుగా ఉండకుండా చూడాలని, ప్రిసైడింగ్‌ అధికారులు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్నిరకాల చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ ముందు రోజు పంపిణీ కేంద్రానికి ఉదయమే చేరుకొని రూట్లకు సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారులతో కలిసి మెటీరియల్‌ పొందాలన్నారు. మధ్యాహ్నంలోగా పోలింగ్‌ కేంద్రాలకు వాహనాలు చేరుకునేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. పోలింగ్‌ రోజు ఉదయమే 5.30గంటలకు మాక్‌పోలింగ్‌ ప్రారంభమయ్యేలా పోలింగ్‌ ఏ జెంట్లు సకాలంలో హాజరయ్యేలా ముందే ఏర్పాటు చేసుకోవాలన్నారు. రిజర్వు ఈవీఎం యంత్రాలను జాగ్రత్తగా పర్యవేక్షించాలని, పోలింగ్‌ రోజుకు 72గంటల ముందు నిర్వహించాల్సిన పనులు జాగ్రత్తగా చేయాలని, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఫిర్యాదులను పరిశీలించాలన్నారు. సెక్టార్‌కు సంబంధించిన ఈవీఎం యంత్రాల ఇంజనీర్లు, తహసీల్దార్‌, పోలీసు ఎస్‌హెచ్‌వోల ఫోన్‌నంబర్లు దగ్గర ఉండాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి ఉండగా జిల్లాస్థాయి మాస్టర్‌ శిక్షకులు నర్సిరెడ్డి, హరినాథరెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌తో ఈవీఎం యంత్రాలను అమర్చేందుకు అవగాహన కల్పించారు.

పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎం యంత్రాల కేటాయింపు

రెండో విడత ర్యాండమైజేషన్‌ ద్వారా భువనగిరి లోక్‌సభ పరిధిలో 2,141 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి ఈవీఎం యంత్రాలను కేటాయించినట్లు కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో సాధారణ పరిశీలకుడు రాబర్ట్‌సింగ్‌ క్షేత్రిమాయూమ్‌తో కలిసి శనివారం వివిధ రాజకీయ పా ర్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ 25శాతం అదనంగా బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, 40శాతం అదనంగా వీవీప్యాట్లు కేటాయించినట్లు చెప్పారు. మొత్తం 2,141 పోలింగ్‌ కేంద్రాలకు 8,023 బ్యాలెట్‌ యూనిట్లు, 2,673 కంట్రోల్‌ యూనిట్లు, 2,994 వీవీప్యాట్లు కేటాయించినట్లు వివరించారు. సమీక్షం లో జిల్లా ఉప ఎన్నికల అధికారి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ పి.బెన్‌ షాలోమ్‌, భువనగిరి ఏఆర్వో, ఆర్డీవో పి.అమరేందర్‌, మునుగోడు ఏ ఆర్వో డి.సుబ్రమణ్యం,నకిరేకల్‌ ఏఆర్వో పూర్ణచందర్‌, తుంగతుర్తి ఏఆ ర్వో బీఎస్‌లత, జనగాం ఏఆర్వో డి.కొమురయ్య, ఇబ్రహీంపట్నం ఏఆ ర్వో కే.అనంతరెడ్డి, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ ఎం. నాగేశ్వరచారి, డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్‌, ఈడీఎం సాయికుమార్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:27 PM