Share News

ప్రసాదం కోసం ప్రయాస

ABN , Publish Date - May 04 , 2024 | 11:42 PM

ఇటీవల యాదగిరిగుట్ట ఆలయ పరిధిలో భక్తుల సౌకర్యార్థం టికెట్లు, ప్రసాదాలు పొందేందుకు కొండపైన శివాలయం ఎదురుగా కొత్త కౌంటర్‌ను ఏర్పాటుచేశారు.

ప్రసాదం కోసం ప్రయాస
కొండపైన శివాలయం ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రసాదాల టికెట్‌ కౌంటర్‌

భువనగిరి అర్బన, మే 4 : ఇటీవల యాదగిరిగుట్ట ఆలయ పరిధిలో భక్తుల సౌకర్యార్థం టికెట్లు, ప్రసాదాలు పొందేందుకు కొండపైన శివాలయం ఎదురుగా కొత్త కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. దీంతో పాటు ధర్మదర్శనం క్యూకాంప్లెక్స్‌ వద్ద మరో కౌంటర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. టికెట్లు, ప్రసాదాలు భక్తులకు వేర్వేరుగా అందించేందుకు అధికారులు ఏర్పాటుచేశారు. కానీ, ప్రస్తుతం శివాలయం ఎదురుగా కౌంటర్‌ ఏర్పాటుచేశారు. ఇక్కడకు చేరుకొని టికెట్లు తీసుకున్న తర్వాత తిరిగి ప్రసాదాలు పొందేందుకు సుమారు 25 మెట్లెక్కి (అంటే 50 మెట్లు) దిగాల్సి వస్తోంది. అందువల్ల ఈ కౌంటర్‌ పూర్తిగా అసౌకర్యంగా ఉందని భక్తులు వాపోతున్నారు. టికెట్లు, ప్ర సాదాలు వేర్వేరు చోట ఇవ్వడంతో రద్దీ తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా, కొన్ని రోజులు కష్ట,నష్టాలను బేరీజు వేసుకొని భక్తులకు కావాల్సిన పద్ధతిలో కౌంటర్లను ఏర్పాటుచేస్తామని డీఈవో దోర్భల భాస్కరశర్మ తెలిపారు. కానీ, శివాలయం ఎదురుగా ఉన్న ప్రసాదాల కౌంటర్‌కు వెళ్లి టికెట్లు తీసుకొని ప్రసాదాలు పొందేందుకు తిరిగి పైకి వెళ్లాల్సి రావడంతో మెట్లెక్కాలంటే కష్టతరంగా ఉంది. కా గా, భక్తుల రద్దీ దృష్ట్యా ప్రసాదాల కౌంటర్లను పెంచాలనే యోచన మంచిదే అయినప్పటికీ టికెట్లు, ప్రసాదాలు దూ రదూరంగా వేర్వేరు చోట్ల లభించడం అసౌకర్యంగా ఉంద ని భక్తులు అభిప్రాయపడుతున్నారు. అన్ని మెట్లు దిగి పైకి ఎక్కాలంటే వృద్ధులు, మహిళలు, పిల్లలు, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఇబ్బందుల దృష్ట్యా కౌంటర్లను భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

కొండపై మార్పులు చేర్పులు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామిని భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో దర్శించుకుంటారు. ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా భక్తుల కు ఎలాంటి సౌకర్యాలు లేకుండా కేవలం బాలాలయం లో స్వామి వారి దర్శనానికి మాత్రమే వీలుండేది. కొత్త ప్రభుత్వం, కొత్త ఈవో వచ్చిన తర్వాత భక్తులకు సౌకర్యా లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారు లు ఏర్పాట్లు ముమ్మరంచేశారు. ఆలయ ప్రారంభంలో కొండపైన మొబైల్‌ మరుగుదొడ్లు ఉండగా, ప్రస్తుతం డార్మెంటరీ హాల్‌ పక్కన శాశ్వత మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా ధర్మదర్శనం క్యూకాంప్లెక్స్‌ ఎదురుగా మరో మరుగుదొడ్ల కాంప్లెక్స్‌ నిర్మాణంలో ఉంది. కాగా, ఇప్పటికే బస్టాండ్‌ ఆవరణలో భక్తులకు కా వాల్సిన సమాచారం అందించేందుకు హెల్ప్‌డె్‌స్కను అం దుబాటులో ఉంచారు. డార్మెంటరీ హాల్‌ను ఆలేరు ఎమ్మె ల్యే, విప్‌ బీర్ల అయిలయ్య ఇటీవల ప్రారంభించగా వాహ న పూజలు నిర్వహించేందుకు స్థలపరిశీలన చేశారు. ఇలా ఒక్కొక్కటిగా పాత విధానం అమలు చేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయాలు వేగవంతం చేశారు.

50 మెట్లెక్కి దిగాల్సి వస్తోంది

టికెట్ల కోసం రానుపోను సుమారు 50 మెట్లెక్కి దిగలేకపోతున్నాం. మోకాళ్ల నొప్పితో తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. కౌంటర్లు పెంచాలనే యోచన స్వాగతించాల్సిందే. కానీ, భక్తులకు అందుబాటులో ఉండాలి. మోకాళ్ల నొప్పులు, మధుమేహం, బీపీ ఉన్న వారు ఉంటారని అధికారులు గమనించాలి. అన్ని మెట్లెక్కిదిగలేరు కాబట్టి వారికి సౌకర్యంగా ఉండేలా కౌంటర్లు ఏర్పాటుచేయాలి.

- జే రమేష్‌ ,వికారాబాద్‌

పరిశీలించి సౌకర్యంగా ఏర్పాటు చేస్తాం

భక్తుల రద్దీ దృష్ట్యా అదనంగా కౌంటర్లను ఏర్పాటుచేస్తున్నాం. వీటితో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో పరిశీలించి వాటిని సవరించేందుకు చర్యలు చేపడుతాం. భక్తుల సౌకర్యాలే ముఖ్యమని ఒక్కొక్కటిగా ఏర్పాట్లుచేస్తున్నాం. భక్తుల కోరిక మేరకు కౌంటర్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తాం. అందుకు భక్తులు సహకరించాలి.

- డీఈవో దోర్భల భాస్కరశర్మ

Updated Date - May 04 , 2024 | 11:42 PM