Share News

మూసీ నదిని శుద్ధీకరించండి

ABN , Publish Date - May 04 , 2024 | 11:45 PM

ప్రజా సమస్యలు, అభివృద్ధిపై నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టులకు ఒకసారి గెలిపిస్తే భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని భువనగిరి పార్లమెంట్‌ సీపీఎం అభ్యర్థి మహ్మద్‌ జహంగీర్‌ అన్నారు.

మూసీ నదిని శుద్ధీకరించండి
ప్రచారంలో మాట్లాడుతున్న సీపీఎం అభ్యర్థి జహంగీర్‌

ప్రశ్నించే గొంతుక కమ్యూనిస్టులను ఒకసారి గెలిపించండి

భువనగిరి పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి జహంగీర్‌

శాలిగౌరారం, మే 4: ప్రజా సమస్యలు, అభివృద్ధిపై నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టులకు ఒకసారి గెలిపిస్తే భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని భువనగిరి పార్లమెంట్‌ సీపీఎం అభ్యర్థి మహ్మద్‌ జహంగీర్‌ అన్నారు. శాలిగౌరారంలో జహంగీర్‌ సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు , సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డితో కలిసి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత రెండు సార్లు గెలిచిన కాంగ్రెస్‌, ఒకసారి గెలిచిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు ఈ ప్రాంతాల అభివృద్ధి ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పుడు పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీ అభ్యర్థులు నియోజకవర్గ ప్రజలకు ఏమి చేస్తారో చెప్పకుండా తమ పార్టీకి మాకు ఓటు వేయాలని తిరుగుతున్నారే తప్ప ఎలాంటి ఎజెండా లేకుండా ఓట్లు అడగడం విడ్డురంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో విద్య, వైద్యం, మౌలిక సౌకర్యాలు అందుబాటులో లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మూసీ నదికి అందం కాదని మొదలు నీటిని శుద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. తాను గెలుస్తే ఢిల్లీలో గళం విప్పి మొదట మూసీ నదిని శుద్ధీకరించడంతో పాటు, అన్ని ప్రాంతాలకు సాగు నీటి సౌకర్యం, ఎయిమ్స్‌ను పూర్తి స్థాయిలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన శాలిగౌరారం ప్రాజెక్టును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు లెల్లెలు బాలకృష్ణ, కందాల ప్రమీల, బొజ్జ చిన వెంకులు, రాచకొండ వెంకన్న, పార్టీ మండల కార్యదర్శి చలకాని మల్లయ్య, నాయకులు గుడిపెల్లి రాంరెడ్డి, కల్లూరి లింగయ్య, మక్క బుచ్చి రాములు, తేలుకుంట్ల జగన, లింగయ్య, బిక్షం, వెంకన్న, అవనిజ, మేరమ్మ, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:45 PM