Share News

భూదానోద్యమంతో పోచంపల్లికి ప్రపంచ ఖ్యాతి

ABN , Publish Date - May 04 , 2024 | 11:42 PM

భూదానోద్యమ చారిత్రక నేపథ్యంతోపాటు పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత వసా్త్రల తయారీ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిందని గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ రాష్ట్ర వైస్‌చైర్మన యానాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

భూదానోద్యమంతో పోచంపల్లికి ప్రపంచ ఖ్యాతి
చేనేత మగ్గంపై వస్త్ర తయారీని పరిశీలిస్తున్న గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ ప్రతినిధులు

గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన రాష్ట్ర వైస్‌చైర్మన యానాల ప్రభాకర్‌రెడ్డి

భూదానపోచంపల్లి, మే 4 : భూదానోద్యమ చారిత్రక నేపథ్యంతోపాటు పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత వసా్త్రల తయారీ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిందని గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ రాష్ట్ర వైస్‌చైర్మన యానాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం భూదానపోచంపల్లిని గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ ప్రతినిధుల బృందం సందర్శించింది. గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన రాష్ట్ర చైర్మన గున్నా రాజేందర్‌రెడ్డి సారథ్యంలో చౌటుప్పల్‌ మండల అధ్యక్షురాలు వెనరెడ్డి సంధ్యారాజు ఆధ్వర్యంలో 20 మంది ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా భూదానోద్యమ స్మృతి చిహ్నం, వినోబామందిరాన్ని సందర్శించి, భూదానోద్యమ చారిత్రక ఘట్టాల ఫొటో గ్యాలరీని వీక్షించారు. అనంతరం పుస్తకాలయాన్ని సందర్శించి వినోబాభావే, గాంధీజీ శాంతి సందేశాలతో కూడిన గ్రంథాలను చూశారు. భూదానగంగోత్రి ప్రాంగణంలోని వినోబాభావే, ప్రధమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలకు నివాళులర్పించారు. భూదానోద్యమ చారిత్రక నేపథ్యాన్ని స్థానిక వినోబా సేవా సంఘం నాయకులు కొయ్యడ నర్సింహగౌడ్‌, వేశాల మురళి వివరించారు. రూరల్‌ టూరిజం సెంటర్‌ను సందర్శించి మ్యూజియంలోని ‘లీవ్‌టుక్లాత’ ప్రాసెసింగ్‌ యూనిట్‌ సందర్శించి పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత వసా్త్రల తయారీ ప్రక్రియలను పరిశీలించారు. చేనేత మగ్గాలను సందర్శించి కార్మికులు కళాత్మకంగా రూపొందించిన చేనేత వసా్త్రల డిజైన్లను వారు పరిశీలించారు. కార్మికుల కళాత్మక నైపుణ్యాన్ని వారు ప్రశంసించారు. భూదానోద్యమం ద్వారా, సిల్కుసిటీ పోచంపల్లి ఖండాంతర ఖ్యాతి గాంచిందన్నారు. చేనేత కార్మికుల ఇళ్లను సందర్శించిన ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత వసా్త్రలు ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అన్నారు. చేనేత కార్మికుల స్వావలంబన దిశగా పయనిస్తూ స్వాభిమానంతో జీవించడానికి ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేనేత వసా్త్రలను ధరించాలన్నారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ రాష్ట్ర వైస్‌ చైర్మన యానాల ప్రభాకర్‌రెడ్డితోపాటు రాష్ట్ర నాయకులు కేవీబీ కృష్ణారావు, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు ఎండి.అజీజ్‌షరీఫ్‌, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ చౌటుప్పల్‌ చైర్మన వేనరెడ్డి సంధ్యారాజు, ప్రతినిధులు డాక్టర్‌ ఉజ్జిని మంజుల, బొబ్బిలి సంధ్య, పోలోజు శ్రీలత, శోభారాణి, భవాని, నీరజ, మమత, పుష్ప, కీర్తన, ఝాన్సీరాణి, జయ, నీరజ, రూప పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:42 PM