Share News

జాతీయ టెన్నిస్‌ సిరీస్‌ విజేతలుగా కిరణ్‌, శ్రీరామోజు

ABN , Publish Date - May 04 , 2024 | 11:44 PM

ఆరు రోజులుగా యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో జరుగుతున్న అండర్‌ -14 టెన్నిస్‌ సిరీస్‌ శనివారంతో ముగిసింది.

జాతీయ టెన్నిస్‌ సిరీస్‌ విజేతలుగా కిరణ్‌, శ్రీరామోజు
సిరీస్‌ విజేతలతో టీఎ్‌సటీఏ అధ్యక్షుడు రమణ్‌, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి

ముగిసిన అండర్‌ -14 జాతీయ స్థాయి టెన్నిస్‌ సిరీస్‌

ఆరు రోజులు కొనసాగిన పోటీలు

భువనగిరి టౌన, మే 4 : ఆరు రోజులుగా యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో జరుగుతున్న అండర్‌ -14 టెన్నిస్‌ సిరీస్‌ శనివారంతో ముగిసింది. చివరి రోజున జరిగిన సింగిల్స్‌ ఫైనల్స్‌లో బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన అథర్వ శ్రీరామోజు, బాలికల ఛాంపియనగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీషితి కిరణ్‌ నిలిచారు. అథర్వ శ్రీరామోజు తెలంగాణకే చెందిన వంజి ఆర్యన పొతునూరిపై 3-6, 6-0, 6-4 సెట్లతో విజయం సాధించాడు. మొదటి సెట్‌లో ఓడినప్పటికీ చివరి రెండు సెట్లలో వరుసగా గెలుపొంది నేషనల్‌ సిరీస్‌ విజేతగా నిలిచాడు. బాలికల విభాగంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీషితి కిరణ్‌, మహారాష్ట్రకు చెందిన శిభాని గుప్తాపై 6-0, 7-5 సెట్లతో గెలుపొంది విజేతగా నిలిచింది. సిరీస్‌ విజేతలకు, ప్రతిభ చూపిన క్రీడాకారులకు త్వరలో ఆల్‌ ఇండియా టెన్నిస్‌ అసోసియేషన పాయింట్స్‌ కేటాయిస్తూ నేషనల్‌ ర్యాంకులను ప్రకటించనుంది. ప్రతి రెండు వారాలకు ర్యాంకులు అప్‌గ్రేడ్‌ అవుతుంటాయి. సిరీస్‌ విజేతలకు తెలంగాణ స్టేట్‌ టెన్నిస్‌ అసోసియేషన(టీఎ్‌సటీఏ) అధ్యక్షుడు కేఆర్‌ రమణ్‌, యాదాద్రి భువనగిరి జిల్లా టెన్నిస్‌ అసోసియేషన అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో న్యూ డైమెన్షన టెన్నిస్‌ అకాడమీ చైర్మన పులిమామిడి సుభా్‌షరెడ్డి, జిల్లా టెన్నిస్‌ అసోసియేషన ప్రధానకార్యదర్శి సయ్యద్‌ ఖలీం అహ్మద్‌, ఉపాధ్యక్షుడు దిడ్డి బాలాజీ, సహాయ కార్యదర్శి పరమే్‌షకుమార్‌ సింగ్‌, కోశాధికారి అతఉల్లాఖాన, సహాయ కార్యదర్శి పరమేశ్వర్‌కుమార్‌ సింగ్‌, సభ్యుడు ఆవుల వినోద్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:44 PM