Share News

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - May 04 , 2024 | 11:46 PM

ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 29వ తేదీన ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.

 ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య
మణికంఠ(ఫైల్‌)

ఐదు రోజులుగా చికిత్స పొందుతూ మృతి

హుజూర్‌నగర్‌, మే 4: ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 29వ తేదీన ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం హుజూర్‌నగర్‌కు చెందిన వీరబాబు, సావిత్రిలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మేకల మణికంఠ(17) ఉన్నారు. తండ్రి హమాలీగా పనిచేస్తుండగా, తల్లి కూలి పనులు చేస్తున్నారు. మణికంఠ స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ (హెచఈసీ) మొదటి సంవత్సరం చదివాడు. గత నెల 24వ తేదీన ఫలితాలు విడుదలకాగా, కొన్ని సబ్జెక్టులు తప్పాడు. కొద్దిరోజులుగా మనస్తాపంగా ఉన్న మణికంఠ 29వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొద్దిసేపటికి వచ్చిన కుటుంబసభ్యులు మణికంఠను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్ళారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న మణికంఠ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మణికంఠ బాబాయి మేకపోతుల సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ముత్తయ్య తెలిపారు.

Updated Date - May 04 , 2024 | 11:46 PM