Share News

బ్యాంక్‌ ఆర్థిక బలోపేతంతోనే జాతీయ స్థాయి గుర్తింపు

ABN , Publish Date - May 04 , 2024 | 11:45 PM

నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తమ పాలకవర్గంలో ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా తనకు జాతీయ స్థాయి ఉత్తమ డీసీసీబీ చైర్మనగా అవార్డు లభించిందని డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.

బ్యాంక్‌ ఆర్థిక బలోపేతంతోనే జాతీయ స్థాయి గుర్తింపు
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన మహేందర్‌రెడ్డి

డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి

నల్లగొండ, మే 4 : నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తమ పాలకవర్గంలో ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా తనకు జాతీయ స్థాయి ఉత్తమ డీసీసీబీ చైర్మనగా అవార్డు లభించిందని డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. జాతీయ ఉత్తమ అవార్డు అందుకున్న నేపథ్యంలో శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో కేంద్ర డీసీసీబీ కార్యాలయంలో ఆయన్ను ఉద్యోగులు, అధికారులతో పాటు పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఉద్యోగి, అధికారులు పీఏసీఎస్‌ పాలకవర్గాల కృషితో పాటు పాలకవర్గ సభ్యుల సహకారంతో దేశంలోని 540డీసీసీబీలల్లో ఐదు డీసీసీబీలు మాత్రమే ఎంపికయ్యాయని అందులో తెలంగాణ నుంచి నల్లగొండ డీసీసీబీ నుంచి తనకు అవార్డు దక్కడం సహకార రంగ వ్యవస్థతో పాటు ప్రతి ఒక్కరికీ గర్వకారణమన్నారు. గత పాలకవర్గ సమయంలో దేవరకొండ బ్యాంక్‌ అక్రమాల వల్ల బ్యాంకు ప్రతిష్ట మసక బారిన సమయంలో ఎనపీఏ 11శాతం ఉండేదని, తాము బాధ్యత చేపట్టాక 1.83శాతానికి ఎనపీఏ చేరుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. బ్యాంకు 103ఏళ్ల చరిత్రలో కేవలం రూ.900కోట్ల టర్నోవర్‌ ఉండగా తాము బాధ్యత చేపట్టిన నాలుగేళ్లలో రూ.2,400 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందన్నారు. డిపాజిట్లు రూ.400కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.674కోట్లకు చేరిందని, అదనంగా రూ.274కోట్లకు అంటే 68శాతానికి పెంచామన్నారు. 2023-24 సంవత్సరం నాటికి అదనంగా రూ.82.42 కోట్ల లాభాలకు చేరుకుందన్నారు. దీనికి ప్రధాన కారణం విద్యా రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, గోల్ట్‌లోనలు పెంచామన్నారు. తమ పాలకవర్గం గడువు మరో ఎనిమిది నెలలు ఉందని ఈ వ్యవధిలో తాము రాష్ట్రంలోనే నల్లగొండ డీసీసీబీని అన్నిరంగాల్లో ముందు ఉంచుతామన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్లు పాశం సంపతరెడ్డి, రంగాచారి, కరుణ, జే.శ్రీనివా్‌సతో పాటు సీఈవో శంకర్‌రావు, జీఎం వసంతరావు, యూనియన నాయకులు రాజు, సుగుణ్‌, రవీందర్‌, శ్రీధర్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి, సతీష్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:45 PM