Share News

ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్‌

ABN , Publish Date - May 04 , 2024 | 11:31 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా సమీకృత కార్యాల యాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎదుట ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్‌ను ఎన్నికల సాధారణ పరిశీ లకులు రుచేస్‌జైవన్షీ, రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ జరిపారు.

ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్‌
రాజకీయ ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్‌లో పాల్గొన్న ఎన్నికల సాధారణ పరిశీలకుడు రుచేస్‌ జైవన్షీ, కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, మే 4 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా సమీకృత కార్యాల యాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎదుట ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్‌ను ఎన్నికల సాధారణ పరిశీ లకులు రుచేస్‌జైవన్షీ, రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ జరిపారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లోని పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించే బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీప్యాట్‌ యంత్రాల ర్యాండమైజేషన్‌ పూర్తి చేశారు. ఈ ప్రక్రియ గురించి కలెక్టర్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు వివరిస్తూ ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్ర్కీన్‌పై పారదర్శకంగా చూపించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ మా ట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్‌ ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్‌లైన్‌ విధానం ద్వారా పారదర్శకంగా ర్యాండమైజేషన్‌కు సంబం ధించిన హార్డ్‌కాపీలు, సాఫ్ట్‌ కాపీలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధులకు అందించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలను తూచ తప్పకుడా పాటిస్తూ పూర్తి పార దర్శకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను చేపడుతున్నామని రిటర్నింగ్‌ అధికారి, తెలిపారు. ఈ ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో జిల్లా అదనపు కలెక్టర్‌ సీతారామారా వు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:31 PM