Share News

సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం

ABN , Publish Date - May 04 , 2024 | 11:29 PM

రాహుల్‌గాంధీని ప్రధానిని చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శా ఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

 సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం
మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, చిత్రంలో మల్లు రవి

- మంత్రి జూపల్లి కృష్ణారావు

పెంట్లవెల్లి, మే 4: రాహుల్‌గాంధీని ప్రధానిని చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శా ఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఇంటింటి ప్ర చారం నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యక ర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4కోట్ల ప్రజల ఆశయాలను 65 సంవత్స రాల తెలంగాణ కలను సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి నెరవేర్చిందని పేర్కొన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఎన్నో అడ్డంకులున్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని ఆయన అన్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చి న హామీ మేరకు ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు టికెట్‌ లేకుండా ఉచిత ప్రయాణం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున 500రూపాయలకే సిలిండర్‌ అమలు కాలేదని, జూన్‌ 3 తర్వాత అమలు చేస్తామని వారన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి అర్హులైన నిరుపేదలను మహిళా సం ఘాలతో కలిసి ఎంపిక చేస్తామని వారితోపాటు నేను కూడా తిరిగి ఎంపిక చేస్తాన న్నారు. అనంతరం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ప్రవేశపెట్టిన ఐదు గ్యారెంటీల్లో భాగంగా ప్రతీ పేద కుటుంబంలో ఒక మహిళకు లక్ష ఆర్థిక సహాయం అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రతిరోజు 400రూపాయలు, చదువుకున్న యువతకు లక్ష వేతనం, స్వామినాథన్‌ కమిషన్‌ మేరకు రుణమాఫీ ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా బ్లాక్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆకునమోని రాముయాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మద గం నరసింహాయాదవ్‌, కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి కబీర్‌, కాంగ్రెస్‌ నాయకులు రామ న్‌గౌడ్‌, ఖాజామైనోద్దీన్‌, ఎర్రశ్రీను, వంగ భాస్కర్‌గౌడ్‌, శశి, రవి, బాలస్వామి, ఆర్‌.వెంకటస్వామి, కుమార్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:29 PM