Share News

గాంధీ పేరు చెబుతూ గాడ్సే పనులు

ABN , Publish Date - May 03 , 2024 | 11:34 PM

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గాంధీ, అంబేడ్కర్‌ సిద్ధాంతాలు చెబుతూనే గాడ్సే పనులు చేస్తారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ తీవ్రంగా విమర్శించారు.

గాంధీ పేరు చెబుతూ గాడ్సే పనులు
సమావేశంలో మాట్లాడుతున్న సంపత్‌కుమార్‌

- స్వేరోస్‌ ముసుగులో విద్యార్థుల జీవితంతో ఆటలు

- ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై ధ్వజమెత్తిన సంపత్‌కుమార్‌

అయిజ, మే 3 : బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గాంధీ, అంబేడ్కర్‌ సిద్ధాంతాలు చెబుతూనే గాడ్సే పనులు చేస్తారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అయిజ పట్టణ అధ్యక్షుడు, అడ్వకేట్‌ మధు కుమార్‌ ఆధ్వర్యంలో, పార్టీ నాయకుడు రంగు శ్రీధర్‌ ఇంటి ఆవరణలో శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌ మాట్లాడుతూ పాఠశాల నిర్వాహణకు వచ్చిన నిధులను స్వేరోస్‌ పేరుతో దారి మళ్లించారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మరో సంస్థను ఏర్పాటు చేసి నాశనం చేస్తారన్నారు. తిట్టిన వ్యక్తుల పంచన తలదాచుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవిని గెలుపించుకుంటేనే మనకు సీఎం దగ్గర విలువ ఉంటుందని, అందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కోరారు. ఎంపీ అభ్యర్థి మల్లురవి మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని ముఖ్యమంత్రి అధ్వర్యంలో నెరవేర్చుతామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. అంతకు బీఆర్‌ఎస్‌కు చెందిన సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు పోతుల జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దావుద్‌, వేణు, మన్సూర్‌, మాల లక్ష్మన్న, సూరీలతో పాటు 120 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షెక్షావలిఆచారి, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మద్దిలేటి, మండల అద్యక్షుడు జయన్న, దేవేంద్ర, హనుమన్న, దొడ్డప్ప, లాల్‌గౌడు, మాజీ ఎంపీపీ ప్రకాష్‌గౌడు, సురేంద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:34 PM