Share News

యువత తీర్పే కీలకం

ABN , Publish Date - May 05 , 2024 | 12:54 AM

సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషిం చనున్నారు.

యువత తీర్పే కీలకం

- సగానికి పైగా 40 ఏళ్ల లోపు ఓటర్లు

- పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ అభ్యర్థుల అంచనాలు

- కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి

జగిత్యాల, మే 4 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషిం చనున్నారు. ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్థులు సైతం తమ వ్యూహాలకు పదును పెడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీ జేపీ అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో విభాగాల వారీగా ఓటర్ల సంఖ్యను బట్టి హామీలు గుప్పిస్తు ముందుకు సాగుతు న్నారు. అధికారులు ప్రకటించిన జాబితాలో యువ ఓటర్ల సంఖ్య అధికం గా ఉండడంతో అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ప్రధాన పార్టీల యువ మంత్రం...

పార్లమెంట్‌ నియోజకవర్గ పరిదిలో మున్సిపాలిటీలతో పాటు అధికశా తం గ్రామీణ ప్రాంతాలు కావడంతో పోలింగ్‌ 70 శాతానికి పైగానే ఉం టుందన్న అంచనాలున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కొంత తక్కువగా ఉన్న ప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య లేదు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవడం కోసం ఏప్రిల్‌ 15 వరకు భారత ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకున్నారు.

అన్ని పార్టీల ఆశలు...

నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్‌లతో పాటు ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోదన్‌ అసెంబ్లీ నియోజకవర్గాలో ఉన్న యువ, వయోజన ఓటర్లు తమకే ఓటు వేస్తారంటే, లేదు తమకే వేస్తారని ప్రధాన రాజకీయ పార్టీలు అం చనాలు వేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలో ని ఏడు నియోజకవర్గాల్లో రెండు కాంగ్రెస్‌, రెండు బీజేపీ, మూడు బీఆర్‌ ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే ఊపుతో ఇప్పుడు మళ్లీ కాం గ్రెస్‌ ఓటు వేస్తారని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికలు వేరు, పార్లమెంట్‌ వేరని, యువత, మధ్య వయసు వారు బీజే పీ వైపు మొగ్గు చూపుతారని కమలనాధులు అంటున్నారు. గత ఎన్నికల్లో ఓటర్లు చేసిన తప్పును సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని, ఈసారి బీఆర్‌ఎస్‌నే గెలిపిస్తారనే నమ్మకం ఉందని గులాబీ నాయకులు అంటున్నారు.

సగం మంది వారే..

నిజామబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 17,04,867 మంది మొత్తం ఓటర్లున్నారు. మొత్తం ఓటర్లలో దాదాపు సగం మంది ఓటర్లు యువతీ యువకులు కావడం గమనార్హం. అదేవిధంగా ఓటు వేసేది కూడా వీరే ఎక్కువగా ఉంటారు. అభ్యర్థి గెలుపోటములపై వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వయసు వారు ఎవరికి మద్దతు తెలిపితే వారే పార్లమెం ట్‌లో జెండా ఎగురవేసి అవకాశం ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అభివృద్ధి, పరిపాలన, అభ్యర్థి పనితీరును బట్టి సమగ్రంగా ఆలోచించి ఓటేసి వారు కావడంతో పార్టీల అభ్యర్థులు వీరిని ఆకట్టుకునేం దుకు ప్రణాళికలు చేసుకుంటున్నారు.

అభ్యర్థుల గాలం...

యువజన ఓటర్లు సుమారు 8,38,264 మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 19 ఏళ్ల లోపు ఓటర్లు 50,963 మంది, 20 నుంచి 29 ఏళ్ల లోపు వారు 3,69,439 మంది, 30 నుంచి 39 ఏళ్ల లోపు 4,17,862 మంది ఉ న్నారు. అభ్యర్థులు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ము మ్మరం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉండే యువజన సంఘాలు, స్వ చ్చంద సంస్థల సభ్యులు మద్దతు కోరుతున్నారు. యువతతో పాటు వారి ఇళ్లలో ఓట్లు తమకే పడేలా చూడాలని వేడుకుంటున్నారు.

నియోజకవర్గానికి ఒక యువ పోలింగ్‌ కేంద్రం...

జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వీప్‌ ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అవగాహన కల్పించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని అధికా రులు ముమ్మరంగా చేయించారు. పోలింగ్‌ కేంద్రాల్లోనూ ప్రత్యేక శిబిరా లను నిర్వహించారు. దీంతో చాలా మంది యువత ముందుకు వచ్చి త మ పేర్లు నమోదు చేయించుకున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధి లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో సుమారు 50,963 మంది యువతీ యువకులు కొత్తగా ఓటు హక్కు పొందారు. వీరంతా ఈ ఎన్నికల్లో తొ లిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యువత తమ పేరు నమోదు చేసుకోవడంలో చూపిన శ్రద్ధ ఓటు వేయడంలోనూ చూపాలని అధికారులు కోరుతున్నారు. పోలింగ్‌ రోజు ఎవరూ ఇతర ప్రాంతాలకు వె ళ్లొద్దని సూచిస్తున్నారు. ఈసారి యువ పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎ న్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గానికి ఒక యువ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయనుంది. అక్కడ విధులు నిర్వహిం చే వారు సైతం యువకులే ఉండే విధంగా అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

వయస్సు వారిగా ఓటర్లు ఇలా...

నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 100 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 214 మంది ఉన్నారు. అదే విధంగా 18 నుంచి 19 సం వత్సరాల వయస్సు వారు 50,963 మంది, 20 నుంచి 29 ఏళ్ల వారు 3,69,439 మంది, 30 నుంచి 39 ఏళ్ల వారు 4,17,862 మంది, 30 నుంచి 39 ఏళ్ల వారు 4,17,862 మంది ఉన్నారు. 40 నుంచి 49 ఏళ్ల వారు 3,30,911 మంది, 50 నుంచి 59 ఏళ్ల వారు 2,65,423 మంది, 60 నుంచి 69 ఏళ్ల వారు 1,58,555 మంది, 70 నుంచి 79 ఏళ్ల వారు 80,916 మంది, 80 నుంచి 89 ఏళ్ల వారు 20,403 మంది, 90 నుంచి 99 ఏళ్ల వారు 3,181 మంది ఉన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:54 AM