Share News

సమన్వయంతో బెంచ్‌ నడిపించాలి

ABN , Publish Date - May 05 , 2024 | 12:29 AM

సమన్వయంతో బెంచ్‌ నడిపించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. ప్రేమలత అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ హాలులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు, న్యాయవాదులకు మఽధ్య పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

సమన్వయంతో బెంచ్‌ నడిపించాలి
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత

సిరిసిల్ల క్రైం, మే 4: సమన్వయంతో బెంచ్‌ నడిపించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. ప్రేమలత అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ హాలులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు, న్యాయవాదులకు మఽధ్య పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బార్‌ అండ్‌ బెంచ్‌ మధ్య స్నేహాపూరిత వాతావరణం కలిగి ఉండాలన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక జైస్వాల్‌, రెండో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి గడ్డం మేఘన, బార్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షుడు డోర్నాల సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. వెంకటి, ఉపాధ్యక్షులు దుర్గారెడ్డి, లైబ్రరీ కార్యదర్శి శశాంకం, మహిళా ప్రతినిధి పుష్పలత, కార్యవర్గ సభ్యులు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

ఈ నెల 6 నుంచి కోర్టులకు సెలవులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా కోర్టు, సిరిసిల్ల, వేములవాడ సీనియర్‌ సివిల్‌ కోర్టులకు ఈనెల 6నుంచి 31వరకు హైకోర్టు సెలవులు ప్రకటించింది. సిరిసిల్ల, వేములవాడ జూనియర్‌ సివిల్‌ కోర్టులకు ఈనెల 13నుంచి 31వరకు సెలవులు ఉన్నట్లు హైకోర్టు వెల్లడించింది. ఈ సెలవుల్లో సివిల్‌ కేసులను విచారణ ఉండదు. కేవలం క్రిమినల్‌, ఆర్‌టీఏ యాక్ట్‌, ఫ్యామిలీ కోర్టు కేసులను మాత్రమే విచారణ చేస్తారు. అత్యవసరంగా ఏదైనా సివిల్‌ కేసు దాఖలు చేయాల్సి వస్తే వెకేషన్‌ కోర్టు ద్వారా వేసుకోవచ్చు. ఈ వేకేషన్‌ కోర్టు కేసులను జిల్లా స్థాయి జడ్జి చూసే అవకాశం ఉంది.

Updated Date - May 05 , 2024 | 12:29 AM