Share News

కాంగ్రెస్‌లో నూతనోత్తేజం

ABN , Publish Date - May 04 , 2024 | 01:43 AM

హస్తం పార్టీలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన కొత్త జోష్‌ నింపింది. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిదిలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం రాజారాంపల్లి గ్రామ శివారులో నిర్వహించిన జ న జాతర సభ సక్సెస్‌ కావడం కాంగ్రెస్‌ నేతల్లో సంబరాన్ని నింపింది. పలు అసెంబ్లీ నియోజకవర్గాల భారీగా జనం తరలిరావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

కాంగ్రెస్‌లో నూతనోత్తేజం

- రాజారాంపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి సభ సక్సెస్‌

- భారీగా తరలివచ్చిన జనం

- పత్తిపాక రిజర్వాయర్‌ మంజూరుకు హామీ

- పాలకుర్తి లిఫ్ట్‌ పనుల పూర్తికి భరోసా

- రామంగుండంలో 800 మెగావాట్లతో పవర్‌ స్టేషన్‌ ఏర్పాటు

- హస్తం పార్టీలో రేవంత్‌ జోష్‌...

జగిత్యాల, మే 3 (ఆంధ్రజ్యోతి): హస్తం పార్టీలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన కొత్త జోష్‌ నింపింది. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిదిలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం రాజారాంపల్లి గ్రామ శివారులో నిర్వహించిన జ న జాతర సభ సక్సెస్‌ కావడం కాంగ్రెస్‌ నేతల్లో సంబరాన్ని నింపింది. పలు అసెంబ్లీ నియోజకవర్గాల భారీగా జనం తరలిరావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మండుతున్న ఎండల్లోనూ సభకు జగిత్యా ల, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకు లు, ప్రజలు భారీగా తరలివచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భా గంగా రాజారాంపల్లి శివారులో డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన జన జాతర బహిరంగ సభ వి జయవంతమైంది. సుమారు మూడు గంటలు సీఎం ఆలస్యంగా వచ్చి న ప్పటికీ సభకు హాజరైన జనం ఓపికగా వేచి చూశారు. ముఖ్యమంత్రి స భా వేదిక వద్దకు వచ్చి అభివాదం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు.

సంక్షేమం..విమర్శలు...

జన జాతర సభలో సీఎం రేవంత్‌ రెడ్డి తొలుత అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. తరువాత బీజేపీ, బీఆర్‌ఎస్‌లను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. దాదాపు 33 నిమిషాల పాటు సీఎం ప్రసంగం కొనసాగింది. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి క రీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు. గ త పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలకు అడుగడుగున కష్టాలు ఎదురయ్యాయ ని విమర్శించారు. నిధులున్న అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టలేద ని మండిపడ్డారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో పలు అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలను చేస్తానని హామీనిచ్చారు. రిజర్వేషన్ల రద్దుకు ప్రయ త్నిస్తున్న బీజేపీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు ఉండాలం టే పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీ గెలవాలని కోరారు. సిం గరేణి పరిశ్రమలో సుమారు 50 వేల కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నా రని, వారంత గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలికారన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రధానిగా పీవీ నర్సింహారావు, స్పీకర్‌గా శ్రీపాదరావు, వెంకటస్వామి తదితరులు రాణించి గుర్తింపు తెచ్చారన్నారు. సింగరేణి కా ర్మికుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని సీ ఎం ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రిగా వ్యవహరించిన కొప్పు ల ఈశ్వర్‌ చేసిన అభివృద్ధి శూన్యమని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కొప్పుల ఈశ్వర్‌ను ఓడించినప్పటికీ బీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం ఆయనకే అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కొప్పుల ఈశ్వ ర్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి వరాల జల్లు...

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్ర మాల కోసం సీఎం వరాల జల్లు కురిపించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బా బు, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కోరిన మేరకు పలు హామీల ను ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పత్తిపాక రిజర్వాయర్‌ను మంజూరు చేస్తానని, రైతుల సాగు నీటి కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. పా లకుర్తి లిప్ట్‌ పనులను పూర్తి చేసే బాధ్యతను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసు కుంటుందని హామీనిచ్చారు. రామగుండంలో 800 మెగావాట్ల పవర్‌ స్టేష న్‌ నిర్మించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న నేత కాని కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు డిమాం డ్‌ను మంజూరు చేస్తానని హామీనిచ్చారు. మంచిర్యాలలో సూపర్‌స్పెషాలి టీ ఆసుపత్రి ఏర్పాటు వ్యవ హారంపై పరిశీలన జరిపి సముచిత నిర్ణ యం తీసుకుంటామన్నారు.

గడ్డం వంశీని పార్లమెంట్‌కు పంపాలి...

పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి గడ్డం వంశీపై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశం సల జల్లు కురిపించారు. ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో గడ్డం వంశీని గె లిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ఇచ్చిన హామీలతో పాటు ఇత ర అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసు కవెళ్లడానికి కాంగ్రెస్‌ పార్టీని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆదరించాల్సిన అవసర ముందన్నారు. ఈ మేరకు పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి, మంత్రి శ్రీధర్‌ బాబుచే వేదికపై నుంచి హామీ తీసుకున్నా రు. గడ్డం వంశీకి రెండు లక్ష మెజార్టీ అందిస్తామని ప్రజలచే అనిపిం చారు. నియోజకవర్గం నుంచి రెండు లక్ష మెజార్టీ తీసుకొని రావడం మీ బాధ్యత అని, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పనులు నిర్వహించడం బాధ్యత తాను తీసుకుంటానని హామీనిచ్చారు.

ఆలోచింపజేసిన గాడిద గుడ్డు...

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జనజాతర బహిరంగ సభ వేదికపై ఏర్పాటు చేసిన గాడిద గుడ్డు ఆకారం ఫ్లకార్డు ఆలోచింపజేసింది. వేదికపై ఏర్పాటు చేసిన ఈ ఆకారం ఆంతర్యం ఏమిటో అర్థం కాక సభకు హాజ రైన జనం అయోమయానికి గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా, రాష్ట్రానికి శూన్య హస్తం చూ పిందన్న భావనతో గాడిద గుడ్డును ప్రదర్శించడం పలువురిని ఆకట్టుకుం ది. సీఎం తన ప్రసంగం సందర్భంగా బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చిందంటే ..ప్రదాని నరేంద్ర మోదీ ఏమి తెచ్చారంటే..గాడిద గుడ్డు అని పలు పర్యా యాలు అనిపించారు. మెట్రో రైలు, మూసి ప్రక్షాళనకు నిధులు, పాల మూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, ఐటీ కారిడార్‌ తదితర వాటికి ప్రధాని మోదీ ఇచ్చింది గాడిద గుడ్డేన న్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను, కాజీపేట రైల్వే, ఐటీకారిడార్‌ను, పాలమూర్‌ ఎత్తిపో తల పథకం తదితర అంశాలల్లో తెలంగాణను బీజేపీ అన్యాయానికి గురిచేసిందని విమర్శించారు.

యువతను మోసం చేసిన ఘనత బీఆర్‌ఎస్‌..బీజేపీలదే

- రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

ధర్మపురి/వెల్గటూరు/ఎండపలి: రాష్ట్రంలో యువతను ఉద్యోగాలు, ఉ పాధి పేరిట మోసానికి గురిచేసిన ఘనత బీఆర్‌ఎస్‌, బీజేపీలదేనని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. యువతకు ఉద్యో గాలు ఇవ్వకుండా, ఉపాధి మార్గం చూపకుండా బీఆర్‌ఎస్‌ సర్కారు అ న్యాయం చేసిందని, కేంద్రంలో ఉన్న బీజేపీ పట్టించుకోలేదని ఆరోపిం చా రు. యువతరానికి స్పూర్తిగా ఉన్న గడ్డం వంశీని అభ్యర్థిగా కాంగ్రెస్‌ నిల బెట్టిందన్నారు. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాల ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక బద్దమైన కార్యక్రమాన్ని తీసుకోవాల న్న ఆలోచన సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమ యంలో కాంగ్రెస్‌ ఇచ్చి ఆరు గ్యారెంటీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించిందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు చేస్తున్న అసత్య ప్ర చారాలను నమ్మవద్ద న్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

పత్తిపాక రిజర్వాయర్‌ ఏర్పరిచి సాగు నీరు అందించాలి

- ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

ధర్మపురి నియోజకవర్గంలో పత్తిపాక రిజర్వాయర్‌ ఏర్పరిచి రైతులకు సాగు నీరు అందించాలని సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కోరారు. 15ఏళ్లుగా ఒకటే జెండా, ఒకటే పార్టీని నమ్ముకు న్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జంగనాథ ప్రాజెక్టు అధునీకరిస్తామన్నారు. గోదావరిపై ఆదారపడ్డ లిప్ట్‌లను ప్రభుత్వం అభి వృద్ధి చేసేలా ప్రయత్నిస్తామన్నారు. ధర్మపురిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల, ఐటీఐ కళాశాల ఏర్పాటు, ధర్మపురి రెవెన్యూ డివి జన్‌ ఏర్పాటు,బస్‌ డిపో ఏర్పాటు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసు కవచ్చి పరిష్కరించాలని కోరారు.

ఆదరించండి...అభివృద్ధి చేస్తా..

- పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీ

ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పో టీ చేస్తున్న తనను ఆదరించి గెలిపించాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు చేస్తానని పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీ అ న్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎన్ని కుట్రలు జరిగిన కాంగ్రెస్‌ జెండాను వదలని కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కాక పోరాటం స్పూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ వచ్చాకనే కన్ను మూస్తానని కంకణం కట్టుకున్న వ్యక్తి కాకా అ ని వివరించారు. గడిచిన పదేళ్ల కాలంలో ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేద న్నా రు. గోదావరి పక్కనే పారుతున్న ధర్మపురికి నీటి కట కట ఎందుకు ఎదు ర్కొన్నారని ప్రజలు ఆలోచించాలన్నారు. 2009లో రామగుండం ఫర్టిలైజ ర్‌ బకాయిలు మాఫీ చేయించిన ఘనత వివేక్‌ వెంకటస్వామిదేనని తెలిపారు.

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి శూన్యం

- చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌

గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ అన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు వి చ్చలవిడిగా జరిగాయని ఆరోపించారు. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ అవి నీతికి పాల్పడ్డాడని, కుమార్తె కవిత తిహార్‌ జైలుకు వెళ్లిందన్నారు. బీఆర్‌ ఎస్‌ పాలనలో కనీసం పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధిలో కేంద్ర సాయం శూన్యంగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు, రా మగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినో ద్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు పునుగోటి శ్రీనివాస్‌ రావు, జిల్లా రారైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నూనె శ్రీనివాస్‌, మైలారపు రాం బాబు, నాయకులు దువ్వ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్‌ రెడ్డి, ఎండీ బషీర్‌, మద్దుల గోపాల్‌,గిల్లు శ్రీనివాస్‌, గాజుల విజయ్‌, మేకల సంతోష్‌లతో పాటు పలువురు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన సాగిందిలా...

ఎండపల్లి/వెల్గటూరు :

ఫ మధ్యాహ్నం 3 గంటలకు రాజారాంపల్లి గ్రామానికి రావాల్సిన సీఎం సాయంత్రం 6.20 గంటలకు హెలిక్యాప్టర్‌ ద్వారా గ్రామానికి చేరుకున్నారు.

ఫ 6.25 నిమిషాలకు హెలిప్యాడ్‌ వద్ద దిగారు.

ఫ 6.30 నిమిషాలకు రోడ్డు మార్గంలో సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

ఫ 6.56 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించారు.

ఫ 7.29 నిమిషాల వరకు ప్రసంగం కొనసాగింది.

ఫ 7.35 గంటలకు ప్రజలకు వీడ్కోలు చెబుతూ సీఎం సభా వేధిక నుంచి వెనుదిరిగారు.

Updated Date - May 04 , 2024 | 01:43 AM