Share News

పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

ABN , Publish Date - May 05 , 2024 | 12:37 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేయాలని, ఎటువంటి అవకతవకలు, అక్రమాలకు పాల్ప డవద్దని అదనప కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ సంబంధిత అధికారులను ఆదేశిం చారు.

పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

పెద్దపల్లిటౌన్‌, మే 4: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేయాలని, ఎటువంటి అవకతవకలు, అక్రమాలకు పాల్ప డవద్దని అదనప కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలె క్టర్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తప్పకుండా పాటించాలని నాణ్యమైన ధాన్యాన్ని పూర్తిస్థా యిలో మద్దతు ధరపై రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైస్‌మిల్లర్లు ఎటువంటి కోతలు లేకుండా ధాన్యం దిగుమతి చేసుకో వాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి, కొనుగోలు కేంద్రం సెం టర్‌ ఇన్‌చార్జీలు, సీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:37 AM