Share News

ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించొద్దు

ABN , Publish Date - May 05 , 2024 | 12:41 AM

ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్‌రావు అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించొద్దు

ఎలిగేడు, మే 4 : ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్‌రావు అన్నారు. శనివారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తానిపర్తి స్రవంతిమోహన్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉన్నట్లు తెలిసిందని, వాటి నివారణలో భాగస్వాము లు కావాలని ఆదేశించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేపట్టిన అమ్మ ఆదర్శ కమి టీల ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలో పేరుకుపోయిన సమస్యలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం మొదలుకాక ముందే ఎస్టిమేట్‌ ప్రకారం పూర్తిచేయాలని, అందుకు ఇంజనీరింగ్‌ అధి కారులు నాణ్యత ప్రమాణాలు పాటించి చేసిన అభి వృద్ధి పనులు పదికాలాలపాటు ఉండే విధంగా పర్యవేక్షణ చేయా లని ఆమె సూచించారు. ఉపాధిహామీ కూలీలకు పనికి తగ్గ వేతనం అందించాలని పనిలో వారికి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించా లని అధిక వేడి ఉన్నందున సరైన ఏర్పాట్లు పూర్తిచేయాలని కోరా రు. ప్రస్తుత విద్య సంవత్సరంలో పదవ తరగతిలో వివిధ ర్యాంక్‌లు సాధించిన విజయం పొందిన విద్యార్థులకు ఆమె ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అందుకు కృషిచేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్‌ల పరిస్థితిపై సమీక్షించారు. వేసవిలో చిన్నపిల్లలకు సరైన వసతుల కల్పనకు కృషిచేయాలని కోరారు. ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో రైతు లు ఎదుర్కొంటున్న పరిస్థితిలు సరైన ఏర్పాట్లు చేసి తూకం విషయంలో అశ్రద్ధ వహించవద్ధని తెలిపారు. ఎస్సారెస్పీ కాలువల మరమ్మత్తులు చేపట్టి వచ్చే వ్యవసాయ సీజన్‌లో రైతులకు ఎలాం టి ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల ని చెప్పారు. గ్రామాల్లో విరివిగా దొరుకుతున్న గుడుంబా మహ మ్మారిని అరికట్టాలని, బెల్ట్‌షాపుల మూసివేతకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంపీవో అనిల్‌రెడ్డి, ఎంపీటీసీలు కొత్తిరెడ్డి ప్రేమలత, తూడి లక్ష్మీ, సావిత్రమ్మ, ఏఈలు సంపత్‌రెడ్డి, యశశ్రీ, అహ్మద్‌అలీ. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ సూర్యకళ, ఎక్సైజ్‌ శాఖ ఎస్సై సరిత, ఎపీఎం సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:42 AM