Share News

సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదు

ABN , Publish Date - May 05 , 2024 | 12:27 AM

నాలుగున్నర నెలలుగా చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్పా సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదు
సిరిసిల్లలో మాట్లాడుతున్న కేటీఆర్‌

సిరిసిల్ల టౌన్‌, మే 3: నాలుగున్నర నెలలుగా చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్పా సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. శనివారం సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో పార్ల మెంట్‌ ఎన్నికల్లో భాగంగా కుల సంఘాలతో కేటీఆర్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో పరిపాలన పిచోడి చేతిలో రాయిలా మారిందన్నారు. కేసీఆర్‌ రూ.3వేల కోట్లు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల నేతన్నల బతుకులు నిలబెట్టారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాల ను ఏర్పాటు చేశారన్నారు. 17 పార్లమెంట్‌ నియోజక వర్గాలకు 17 జిల్లాలు ఉండాలని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారని, 33 జిల్లాలో ఏ జిల్లాలను తొలగిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దమ్ముంటే నేతన్నలకు రూ. 6వేల కోట్ల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిన్న మొన్నటి వరకు తంగళ్లపల్లి బ్రిడ్జి కింద గోదావరి నీళ్లు కనిపించేవని రేవంత్‌రెడ్డి వచ్చాక మాయమయ్యాయని అన్నారు. ఈ ప్రాంతంలో బోర్లు ఎత్తిపోతున్నాయని, ప్రజల గొంతులు ఎండి పోయి నీళ్ల కోసం అలమటిస్తున్నారని అన్నారు. రైతుల పంటలు ఎండి పోతున్నా రేవంత్‌రెడ్డి ఒక్కమాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి చెప్పే అబద్ధాలను ప్రజలు చీత్కరిస్తున్నారన్నారు. ఈ నెల 13న తెలంగాణ ప్రజలు బుద్ధి చెపుతారన్నారు. అంతకుముందు అనంతరం తంగళ్లపల్లి మండలం బీఎస్పీ అధ్యక్షుడు గుండు ప్రేమ్‌కుమార్‌ తన అనుచర వర్గంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్‌, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, డైరెక్టర్‌ దార్నం లక్ష్మినారాయణ, కౌన్సిలర్‌ అన్నారపు శ్రీనివాస్‌, నాయకులు అగ్గిరాములు, మల్లారెడ్డి, పడిగెల రాజు, కోడి అంతయ్య, గజభీంకర్‌ రాజన్న, రమాకాంత్‌ పాల్గొన్నారు.

మోసపోతే గోపడతం

వీర్నపల్లి : ఎన్నికల్లో మొదటిసారి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవద్దని, మోసపోతే గోసపడతామని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుం ఠాన్ని చూపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, అరచేతిలో స్వర్గం చూపించింద న్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వంలో లోక్‌సభ ఎంపీగా అభివృద్ధి చేసిన శిలాఫలకం ఒక్కటి చూపించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 10 నుంచి 12 సీట్లు గెలిపిస్తే రాష్ట్రంలో కేసీఆర్‌ రాజకీయాన్ని మారుస్తారన్నారు. కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కేటీఆర్‌ సమక్షంలో మండల కేంద్రానికి చెందిన 30 మంది యువకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ కళావతి, ఎంపీపీ భూల, మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ మల్లేశం, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు చాంద్‌పాషా, మహిళా అధ్యక్షురాలు కళ, యూత్‌ అధ్యక్షుడు దేవరాజు, వైస్‌ ఎంపీపీ హేమ, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సాగర్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఉస్మాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:27 AM