Share News

Kumaram Bheem Asifabad: జిల్లా జోలికి వస్తే ఊర్కునేది లేదు: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ABN , Publish Date - May 03 , 2024 | 11:12 PM

ఆసిఫాబాద్‌, మే 3: చిన్న జిల్లాలను కుదించడానికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని ఆదివాసీల జిల్లా ఆసిఫాబాద్‌కు జోలికివస్తే ఊర్కునేది లేదని ఎమ్మెల్యే కోవలక్ష్మి మండిపడ్డారు. శుక్రవారం ఎమ్మెల్యే తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

 Kumaram Bheem Asifabad: జిల్లా జోలికి వస్తే ఊర్కునేది లేదు: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

- ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, మే 3: చిన్న జిల్లాలను కుదించడానికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని ఆదివాసీల జిల్లా ఆసిఫాబాద్‌కు జోలికివస్తే ఊర్కునేది లేదని ఎమ్మెల్యే కోవలక్ష్మి మండిపడ్డారు. శుక్రవారం ఎమ్మెల్యే తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల సౌకర్యార్థం పరిపాలన కోసం అప్పటి సీఎం కేసీఆర్‌ చిన్నజిల్లాల ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలఏర్పాటుతో ప్రజలకు పరిపాలనపరంగా అన్నిసౌకర్యాలు కలుగుతున్నా యన్నారు. జిల్లాకు ఒకమెడికల్‌ కళాశాలతో ప్రజలకు వైద్యసేవలు అందు బాటులోకి వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వం చిన్న జిల్లాలను కుదించేందుకు యోచిస్తోందని అన్నారు. ఆదివాసీలు అధికంగా నివహించే కుమరంభీం జిల్లాను కుదిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊర్కొనేది లేదన్నారు. జిల్లాను కుదిస్తే ఆది వాసీలమంతా ఏకమై ఉద్యమం చేపడుతామన్నారు. జిల్లాను కుదిస్తే ఆదివాసీ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ యోచనను మానుకోవాలన్నారు. లేనిపక్షంలో అన్నివర్గాల ప్రజలు ఏకమై ఐక్యపోరాటాలకు సిద్ధమవుతామన్నారు. కాంగ్రెస్‌ నాయకులను జిల్లాలో తిరగన్వివమని హెచ్చ రించారు. చిన్నజిల్లాలను అభివృద్ధి చేయాల్సిందిపోయి కుదిస్తామనడం విడ్డూ రంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేద న్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు అలీబీన్‌ అహ్మద్‌, వెంకన్న, రవీందర్‌, నిసార్‌, హైమద్‌, బలరాం పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:12 PM