Share News

Kumaram Bheem Asifabad: పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - May 03 , 2024 | 11:07 PM

ఆసిఫాబాద్‌, మే 3: ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి పోస్టల్‌బ్యాలెట్‌ను సద్వినియోగం చేసు కోవాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad: పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 3: ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి పోస్టల్‌బ్యాలెట్‌ను సద్వినియోగం చేసు కోవాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గ పార్ల మెంట్‌ పరిధిలోని ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ విని యోగించుకునేందుకు జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటరు పెసిలిటేషన్‌ సెంటర్‌ను అదనపుకలెక్టర్‌ దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ నెల3నుంచి 8వరకు ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహ క్కును ఈకేంద్రంలో వినియోగించుకోవాలని తెలి పారు. మొత్తం 2420 మంది ఉద్యోగులు ఈ ఓటరు ఫెసిలిటిటేషన్‌ సెంటర్‌లో ఓటు వేసేందుకు దర ఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ సంద ర్భంగా ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాట్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రంలో విధులు నిర్వహించే ఉద్యోగులు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. కార్య క్రమంలో తహసీల్దా ర్‌లు, ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: సిర్పూరు నియోజవర్గంలో ఎన్నికల విధుల కోసం 1400మందిని కేటాయించామని అద నపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ అన్నారు. శుక్రవారం కాగజ్‌నగర్‌ ఆర్డీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వీరందరి కోసం కాగజ్‌నగర్‌ ఆర్డీవో కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌కేంద్రం ఏర్పాటుచేసినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల8వరకు ఉదయం9నుంచి సాయంత్రం 5గంటలవరకు ఓటు వేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:07 PM