Share News

Kumaram Bheem Asifabad: కమిషనింగ్‌ ప్రక్రియను అప్రమత్తంగా చేపట్టాలి: కలెక్టర్‌

ABN , Publish Date - May 04 , 2024 | 11:21 PM

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌, మే 4: ఎన్నికల నిర్వహణలో ఓటింగ్‌ యంత్రాల కమి షనింగ్‌ ప్రక్రియ చాలా ముఖ్యమైదని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad:  కమిషనింగ్‌ ప్రక్రియను అప్రమత్తంగా చేపట్టాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌, మే 4: ఎన్నికల నిర్వహణలో ఓటింగ్‌ యంత్రాల కమి షనింగ్‌ ప్రక్రియ చాలా ముఖ్యమైదని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పీటీజీ పాఠశాలలో, కాగజ్‌నగర్‌లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గంలో పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌యంత్రాల కమిషనింగ్‌ ప్రక్రియను ఆయన సహాయఎన్నికల అధికారులు దాసరివేణు, దీపక్‌ తివారితో కలిసి పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల బరిలో 12మంది అభ్యర్థులు ఉన్నందున నోటాతో కలిపి మొత్తం 13బటన్లు ఓటింగ్‌ యంత్రంలో పనిచేసేలా చూడాలన్నారు. మిగితా బటన్లకు సీలు వేయాలన్నారు. ఓటింగ్‌ యంత్రంపై అభ్యర్థులవివరాలు, గుర్తులు స్పష్టంగా కనబడేలా ఉండాల న్నారు. ఓటింగ్‌ యంత్రంలో ప్రతి ప్రక్రియను అప్రమత్తంగా చేపట్టాలని ఎలాంటి తప్పులు లేకుండా చూడాలన్నారు. కాగజ్‌నగర్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి మాట్లాడుతూ కమిషనింగ్‌ ప్రక్రియకు 40టేబుళ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి టేబుల్‌కు సెక్టార్‌ అధికారులు ఇంచార్జిగా ఉండి పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమాల్లో ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, సురేస్‌, తహసీల్దార్లు, సెక్టార్‌ అధికారులు, రాజకీయపార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:22 PM