Share News

Health Tips : గవదబిళ్లలు పెద్దల్లోనూ ఉంటాయా? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..!

ABN , Publish Date - May 03 , 2024 | 03:49 PM

లాలాజలం, శ్వాసకోశ స్రావాలతో గవదబిళ్లలు వ్యాపిస్తాయి. పిల్లల్లో ఈ సమస్య వ్యాప్తికి అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి.. వ్యక్తిగత వస్తువులను తాకడం,. పంచుకోవడం, దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు కూడా సన్నిహితంగా ఉండటం వల్ల కూడా గవదబిళ్లలు వస్తాయి.

Health Tips : గవదబిళ్లలు పెద్దల్లోనూ ఉంటాయా? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..!
mumps affect adults

గవదబిళ్లలు ఈ సమస్య పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇవి ఎలా వస్తాయి. పెద్దల్లో లక్షణాలు వేరేగా ఉంటాయా ఇదే తెలసుకుందాం. అసలు పెద్దల్లో కూడా గవదబిళ్లలు వస్తాయా.. వస్తే ఈ లక్షణాలు ఎలా ఉంటాయనేది చూద్దాం. ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఆరు, ఏడు సంవత్సరాల మధ్య వయస్సగల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ వ్యాధి పెద్దల్లో..

గవదబిళ్లల వ్యాధి పెద్దల్లో కూడా కనిపిస్తుంది. టీకాలు వేయించుకోనివారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పెద్దల్లో లక్షణాలు ఏలా ఉంటాయి. .

పెద్దల్లో గవదబిళ్లల కారణంగా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట, ఆకలి లేకపోవడం ఉంటుంది. చెవి తమ్మి కింద పరోటిడ్ గ్రంథుల వాపు, నొప్పి ఉంటుంది. ఇది మగవారిలో ఆర్కిటిస్ వాపు ఉంటుంది. ఆడవారిలో అండాశయాల ( ఓఫోరిటిస్ ) వాపు ఉంటుంది.

ఈ డైట్ బరువు తగ్గడానికి సరైనదేనా.. ఓసారి ట్రై చేస్తే సరి..!


పెద్దల్లో మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి సమస్యలు రావచ్చు. ఇవి తీవ్రంగా ఉంటాయి. గవదబిళ్లలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక టీకాలు తీసుకోవడం తప్పనిసరి.

గవదబిళ్లలు ఎలా వ్యాపిస్తాయి.

లాలాజలం, శ్వాసకోశ స్రావాలతో గవదబిళ్లలు వ్యాపిస్తాయి. పిల్లల్లో ఈ సమస్య వ్యాప్తికి అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి.. వ్యక్తిగత వస్తువులను తాకడం,. పంచుకోవడం, దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు కూడా సన్నిహితంగా ఉండటం వల్ల కూడా గవదబిళ్లలు వస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో ఒత్తిడి, అలసట ఉంటాయి. ఈ ప్రమాధాన్ని తగ్గించడానికి టీకాలు వేయించుకోవాలి. పరిశుభ్రతను పాటించాలి. రద్దీగా ఉంటే వాతారవణంలో ఉండకపోవడం మంచిది.

Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!


చికిత్సలు..

గవదబిళ్లలకు చికిత్సలు.. యాంటీ వైరల్ మందులు, ప్రత్యేకంగా గవదబిళ్లల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా శరీరం ఇన్ఫెక్షన్ పెరుగుతుంటే, జ్వరం కూడా పెరుగుందనిపించగానే డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లడం మంచిది.

బాగా వాచిన లాలాజల గ్రంథులు అసౌకర్యంగా ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల త్వరగాకోలుకునే అవకాశం ఉంటుంది. వాపు ఉన్న ప్రాంతాల్లో గోరువెచ్చని వస్త్రంతో తుడవడం వంటివి చేస్తే కాస్త రిలీఫ్ ఉంటుంది. ఈ సమస్య 10 నుంచి 14రోజుల్లో తగ్గుతుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 03 , 2024 | 03:49 PM