Share News

Cold Water : వేసవిలో చల్లని నీరు తాగడం మంచిదేనా? దీని వల్ల కలిగే నష్టాలు ఏంటి?

ABN , Publish Date - May 03 , 2024 | 02:05 PM

మండే ఎండల్లో వేడిని, దాహాన్ని తట్టుకోవడానికి చల్లగా తీసుకోవడం అనేది ఎంతవరకూ మంచిది. దీనివల్ల ప్రధాన ప్రభావాల్లో జీర్ణక్రియ ఇబ్బందులు తలెత్తుతాయి. చల్లని నీరు తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం అయ్యే సమయం ఎక్కువగా ఉంటుంది.

Cold Water : వేసవిలో చల్లని నీరు తాగడం మంచిదేనా? దీని వల్ల కలిగే నష్టాలు ఏంటి?
Cold Water

వేసవి వచ్చిందంటే చాలు వేడి, దానితోపాటే దాహం తరుముతూ ఉంటుంది. చల్లని నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుందనే వాదన కూడా ఉంది. నీరు శరీరానికి అవసరం. దానిని మండే ఎండల్లో వేడిని, దాహాన్ని తట్టుకోవడానికి చల్లగా తీసుకోవడం అనేది ఎంతవరకూ మంచిది. దీనివల్ల ప్రధాన ప్రభావాల్లో జీర్ణక్రియ ఇబ్బందులు తలెత్తుతాయి. చల్లని నీరు తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం అయ్యే సమయం ఎక్కువగా ఉంటుంది. దీనితో కడుపులో ఇబ్బందులు మొదలవుతాయి. ఎసిడిటీ, వాంతులు, వికారం వంటి సమస్యలుంటాయి. మండే వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో చూద్దాం.

1. చల్లని నీరు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో జరిగే జీవక్రియలు మందగించి, అలసటగా అనిపిస్తుంది. శక్తి నశించినట్టుగా అనిపిస్తుంది.

2. గొంతు నొప్పిగా అనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

Summer Skin Care : వేసవిలో జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!

3. గుండె స్పందన తగ్గవచ్చు. శరీర ఉష్ణోగ్రత సహజంగానే ఎక్కువగా ఉంటుంది. మరీ చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం కూడా లేకపోలేదు.


4. కడుపు నొప్పి, వికారం, మలబద్దకం వంటి సమస్యలతో పాటు శరీరం ఉష్ణోగ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!

5. మైగ్రేయిన్ నొప్పి ఉన్నవారు ఈ నీటిని అతి చల్లగా తీసుకుంటే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

6. చల్లని నీటిని తీసుకునే వారిలో మెదడుకు పక్షవాతం వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు దీనితో తలనొప్పిసైనస్ సమస్యలు కూడా ఉంటాయి.

7. చల్లని నీటికి బదులు గోరువెచ్చని నీటిని తీసుకోవడం అనేది శరీరానికి అనేక సమస్యలు రాకుండా చేస్తుంది. రక్తప్రసరణకు, జీర్ణక్రియకు టాక్సిన్లు బయటకు వెళ్ళేందుకు కూడా వెచ్చని నీరు సహకరిస్తుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 03 , 2024 | 02:05 PM