Share News

Health Tips: ఎక్కువ సమయం ల్యాప్టాప్ ముందు కూర్చుని లేదా నిలబడి గడుపుతున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివీ..!

ABN , Publish Date - May 04 , 2024 | 04:01 PM

చాలామంది ల్యాప్టాప్ లు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని ఉద్యోగాలు చెయ్యాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వీటి మధ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద ఛాలెంజ్ అనే చెప్పవచ్చు.

Health Tips: ఎక్కువ సమయం ల్యాప్టాప్ ముందు కూర్చుని లేదా నిలబడి  గడుపుతున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివీ..!

ఇప్పట్లో శారరీక శ్రమ కంటే మానసిక శ్రమ ఎక్కువగా ఉంటోంది. చాలామంది ల్యాప్టాప్ లు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని ఉద్యోగాలు చెయ్యాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వీటి మధ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద ఛాలెంజ్ అనే చెప్పవచ్చు. తీసుకునే ఆహారం, ఆహారం నుండి అందే కేలరీలు, ఖర్చయ్యే కేలరీలు, శారీరక శ్రమ చేసే సమయం వీటిని పరిగణలోకి తీసుకోవడం ఎంతో ముఖ్యం. మరీ ముఖ్యంగా రోజులో ఎంతసేపు కూర్చొంటున్నాం, ఎంతసేపు నిలబడి ఉంటున్నాం అనేది కూడా ముఖ్యమే.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఎక్కువసేపు కూర్చుని ఉండటం వల్ల ఆరోగ్యం మీద హానికర ప్రభావాలు ఉంటాయి. ఇందులో ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా డెస్క్ జాబ్ నే నిలబడుకుని చేయడం వల్ల కండరాలను యాక్టీవ్ గా ఉంచడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, కేలరీలను బర్న్ చేయడం ద్వారా.. కూర్చుని పనిచేయడం వల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావలను కొన్నింటిని తగ్గించుకోవచ్చు.

రోజూ పాలతో చేసిన టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..!


రోజుకు ఎన్ని గంటలు నిలబడాలి అనేది వయసు, ఫిట్‌నెస్ స్థాయి, చేసే ఉద్యోగం వంటి వాటి పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని గంటల పాటూ కూర్చున్న తరువాత కనీసం 30 నిమిషాల నుండి గంట సేపు వరకు నిలబడుకోవడం మంచిది. అదే విధంగా ప్రతి అరగంట లేదా గంటకు ఒకసారి లేచి కనీసం ఒక 5 నిమిషాలు నడవడం కూడా మంచిది. డెస్క్ జాబ్ చేసేవారు స్ఠాండింగ్ డెస్క్ లేదా డెస్క్ కన్వర్టర్ ని ఉపయోగించడం వల్ల రోజంతా కూర్చుని పనిచేయడం, నిలబడుకోవడం మధ్య సరైన బ్యాలెన్స్ చూసుకోవచ్చు.

వేయించిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజానాల గురించి తెలుసా?


నిలబడుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదనే ఆలోచనతో రోజులో ఎక్కువసేపు ఏకధాటిగా నిలబడినా అది కండరాల ఒత్తిడి, అలసట, కీళ్ల నొప్పులతో సహా చాలా సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి కూర్చుని అయినా, నిలబడి అయినా ఎక్కువసేపు అదే పొజిషన్ లో ఉండకుండా పొజిషన్ మారడం మంచిది. అదే విధంగా రోజులో కొద్దిసేపు శారరీక వ్యాయామం, నడక, రన్నింగ్, వాకింగ్, ఇతర వ్యాయామాలు చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.

వేయించిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజానాల గురించి తెలుసా?

రోజూ పాలతో చేసిన టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 04 , 2024 | 04:01 PM