Share News

INDIA vs Pakistan: ఈ బిస్కెట్ ప్యాకెట్ ధర భారత్‌లో రూ.5.. పాకిస్తాన్‌లో ఎంతో తెలుసా..!

ABN , Publish Date - May 05 , 2024 | 08:02 AM

బాగా ఆకలివేస్తుందా.. జేబులో ఐదు రూపాయిలుంటే ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని కడుపు నింపుకోవచ్చు.. భారత్‌లో సామాన్య మనిషి ఆలోచించే విధానం. ఎందుకంటే తక్కువ ధరలో ఆకలి తీర్చేది బిస్కెటు మాత్రమే. సాధారణంగా భారత్‌లో అతి తక్కువ ధరకు ఎక్కువ పరిమాణంలో లభించేవి పార్లే-జి బిస్కెట్లని అందరికీ తెలుసు.

INDIA vs Pakistan: ఈ బిస్కెట్ ప్యాకెట్ ధర భారత్‌లో రూ.5.. పాకిస్తాన్‌లో ఎంతో తెలుసా..!
Parle-G Biscutes

బాగా ఆకలివేస్తుందా.. జేబులో ఐదు రూపాయిలుంటే ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని కడుపు నింపుకోవచ్చు.. భారత్‌లో సామాన్య మనిషి ఆలోచించే విధానం. ఎందుకంటే తక్కువ ధరలో ఆకలి తీర్చేది బిస్కెటు మాత్రమే. సాధారణంగా భారత్‌లో అతి తక్కువ ధరకు ఎక్కువ పరిమాణంలో లభించేవి పార్లే-జి బిస్కెట్లని అందరికీ తెలుసు. దానికితోడు ఆ బిస్కెట్ల రుచి కూడా ఎక్కువమందికి నచ్చుతుంది. దీంతో సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకు అంతా పార్లే-జి బిస్కెట్లను ఇష్టపడుతుంటారు.


భారత్‌లో పార్లే-జి బిస్కెట్లు తినని వ్యక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. గతంలోనే కాదు.. ప్రస్తుతం రకరకాల రుచులు, ఆకారాలతో ఎన్నో రకాల బిస్కెట్లు వస్తున్నా.. పార్లే-జి బిస్కెట్లకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. పేదల నుంచి సంపన్నుల వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతిచోట పార్లే-జి బిస్కెట్లకు డిమాండ్ ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఈ బిస్కెట్లను తింటుంటారు. ఇప్పటికీ చాలామంది టీ తాగే పార్లే-జి బిస్కెట్లను తింటుంటారు. కొందరు టీకి ముందు తింటే.. మరికొంతమంది టీలో ముంచుకుని ఈ బిస్కెట్లను తింటుంటారు. ప్రస్తుతం భారత్‌లో రూ.5కే పార్లే-జి 65 గ్రాముల బరువున్న బిస్కెట్ ప్యాకుట్ లభిస్తుంది. పార్లే-జి బిస్కెట్లకు భారత్‌లోనే కాకుండా పాకిస్తాన్, అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఆ దేశాల్లోనూ ఈ బిస్కెట్లను ఇష్టపడేవాళ్లు చాలా మంది ఉంటారు. ఈ క్రమంలో విదేశాల్లో ఈ బిస్కెట్ ప్యాకెట్ల ధరలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. మన పక్కదేశాల్లో పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్ల ధర ఎంత ఉందో తెలుసుకుందాం.

22% పెరిగిన డీ-మార్ట్‌ లాభం


పార్లే-జి చరిత్ర..

పార్లే-జి బిస్కెట్లకు పెద్ద చరిత్రనే ఉంది. ముంబైలోని విల్లే పార్లే పరిసరాల్లో ఈ బిస్కెట్లు మొదట తయారయ్యేవి. 1929లో మోహన్‌లాల్ దయాళ్ అనే వ్యాపారవేత్త ముంబయిలో మూతపడిన ఓ ఫ్యాక్టరీని మిఠాయి యూనిట్‌గా మార్చారు. ఆ తరువాత 1938లో తొలిసారిగా పార్లే-గ్లూకో పేరుతో బిస్కెట్లను తయారుచేశారు.


స్వాతంత్యానికి ముందు పార్లే-జిని గ్లూకో బిస్కెట్లు అని పిలిచేవారు. బిస్కెట్ల తయారీకి గోధుమలు అవసరం. అయితే గోధుమల కొరత కారణంగా స్వాతంత్య్రం తరువాత పార్లే-జి బిస్కెట్ల ఉత్పత్తి ఆగిపోయింది. ఆ తరువాత కొనేళ్లకు మళ్లీ ఉత్పత్తిని పునఃప్రారంభించింది. బ్రిటానియా, గ్లూకోజ్-డి వంటి బిస్కెట్ తయారీ కంపెనీలకు పోటీగా పార్లే-జి పేరుతో బిస్కెట్ల ఉత్పత్తి పునఃప్రారంభమైంది. 2000 సంవత్సరంలో ఈ కంపెనీ పార్లే-జిలో Gను జీనియస్ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రచారం చేసింది, అయినప్పటికీ 'G' అసలు అర్థం గ్లూకోజ్ నుండి వచ్చింది.


పాకిస్తాన్‌లో ఎంతంటే..

భారత్‌లో అతి తక్కువకు లభించే పార్లే-జి బిస్కెట్ల ధర పాకిస్తాన్, అమెరికాలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇండియాలో 65 గ్రాముల పార్లే-జి బిస్కెట్ ప్యాక్ ధర 5 రూపాయలు. అమెరికాలో $1(ఒక డాలర్)కి సుమారుగా 56.5 గ్రాముల బరువుండే 8 పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్లు లభిస్తాయి. దీని ప్రకారం ఒక్కో ప్యాకెట్ ధర దాదారు 10 రూపాయిలు. భారత్ కంటే అమెరికాలో ఈ బిస్కెట్ల ధరం కొంచెం ఎక్కువుగానే ఉంది. మరి ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో మాత్రం ఈ బిస్కెట్ ప్యాకెట్ల ధర తెలుసుకుంటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. భారతదేశంలో రూ. 5 ధర ఉన్న పార్లే-జి ప్యాకెట్ పాకిస్తాన్‌లో దాదాపు రూ. 50కి విక్రయిస్తున్నారు. దీంతో పార్లే-జి బిస్కెట్లు ఇతర దేశాల్లో చాలా ఖరీదని తెలుస్తోంది.


Gold Price: బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలిలా ఉన్నాయ్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For Latest News and Telugu News click here

Updated Date - May 05 , 2024 | 08:11 AM