Share News

చంద్రబాబు పర్యటన సైడ్‌లైట్స్‌

ABN , Publish Date - May 05 , 2024 | 12:15 AM

చంద్రబాబునాయుడు నూజివీడుకు 3.45 గంటలకు చేరుకున్నారు.

చంద్రబాబు పర్యటన సైడ్‌లైట్స్‌

చంద్రబాబునాయుడు నూజివీడుకు 3.45 గంటలకు చేరుకున్నారు.

ముఖ్య నాయకులతో సమావేశమై 4.15 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

తొలుత నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అనంతరం ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థి పుట్టామహేష్‌యాదవ్‌లు ప్రసంగించగా, 5 గంటలకు చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

అర్ధగంటపాటు సుదీర్ఘంగా సాగిన ప్రసంగాన్ని ఏ మాత్రం విసుగుచెందకుండా ప్రజలు అలాగే నిలబడి వింటూ చంద్రబాబు ప్రశ్నలకు స్పందించారు.

ఫసభ జరుగుతున్నంత సేపు విజయవాడ రహదారివైపుగా ప్రజలు సభాప్రాంగణానికి వస్తూనే ఉన్నారు.

భద్రత దృష్ట్యా పోలీసులు నూజివీడు టీడీపీ ఆఫీస్‌ నుంచి సభా ప్రాంగణం మధ్యలో మూడు రో పార్టీలను ఉంచడంతో చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం కూడా కార్యకర్తలు, ప్రజలు సభా ప్రాంగణానికి తరలివస్తూనే ఉన్నారు.

చంద్రబాబు తన ప్రసంగంలో మహిళా శక్తి పథకాలను వివరిస్తున్న సమయంలో మహిళల నుంచి విశేష స్పందన వ్యక్తమైంది.

ముద్దరబోయిన భవిష్యత్‌ నాది అంటూ చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో కార్యకర్తల నుంచి విశేష స్పందన వచ్చింది.

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశమై చంద్రబాబు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గాన్ని అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాలో కలుపుతామంటూ హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజలు భావోద్వేగంతో స్పందించారు.

నూజివీడు వచ్చిన చంద్రబాబు సమక్షంలో హెలిప్యాడ్‌ వద్ద నూజివీడుకు చెందిన పలువురు న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీలో చేరారు.

పామాయిల్‌ రైతుల సమస్యలపై నూజివీడుకు చెందిన రైతు నాయకులు బొబ్బా వీరరాఘవులు, యనమదల దాసు, తదితరులు చంద్రబాబుకు వినతిపత్రాన్ని అందించారు.

– నూజివీడు టౌన్‌

Updated Date - May 05 , 2024 | 12:15 AM