Share News

మహిళా సంఘాల సీఏలకు బెదిరింపులు

ABN , Publish Date - May 05 , 2024 | 12:03 AM

వైసీపీ మహిళా నేతలు కూడా ఇప్పుడు బెదిరింపు రాజకీయాలకు తెర తీశారు.

మహిళా సంఘాల సీఏలకు బెదిరింపులు

మహిళా సంఘాల సీఏలకు బెదిరింపులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

అధికార పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. వైసీపీ మహిళా నేతలు కూడా ఇప్పుడు బెదిరింపు రాజకీయాలకు తెర తీశారు. పెనుమంట్ర మండలం లో ఇద్దరు అధికార పార్టీ మహిళా నేతలు డ్వాక్రా సంఘాల పేరుతో రుణం తీసుకున్నారు. వారే తిరిగి రుణాలు చెల్లిస్తున్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని డ్వాక్రా సంఘాల సీఎలను ఒప్పించారు. సంఘాల అనుమతితో రుణాలు పొందారు. వాటిని తిరిగి చెల్లిస్తూ వచ్చిన మహిళా నేతలు ఇప్పుడు అధికార పార్టీ కోసం ఎన్నికల ప్రలోభాలకు దిగారు. వైసీపీకి అనుకూలంగా డ్వాక్రా మహిళలను ఒప్పించకపోతే రుణాలు తీసుకున్న సంగతిని బయట పెడతామంటూ బెదిరిస్తున్నారు. దాంతో కొందరు డ్వాక్రా సంఘాల సీఏలు హడలిపోతున్నారు. మరోవైపు డ్వాక్రా సీఏలతో ఒక మహిళా నేత సమావేశమయ్యారు డ్వాక్రా మహిళలను వైసీపీ అనుకూలంగా వ్యవహరించేలా చూసేందుకు తాయిలాలు ఇచ్చారు. ఒక్కో సీఏకి రూ. 5వేల వంతున ఇచ్చినట్టు సమాచారం. మిగిలిన గ్రామాల్లో సమావేశం ఏర్పాటుచేసి సీఏలకు తాయిలాలు ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల ముఖ్యులకు ఎర వేయనున్నారు. ఇప్పటికే భీమవరంలో డ్వాక్రా సభ్యులకు తాయిలాలు అందాయి. ఆచంటలో ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.

Updated Date - May 05 , 2024 | 12:03 AM