Share News

ఈ వయసులో ఏడిపిస్తారా !

ABN , Publish Date - May 04 , 2024 | 11:51 PM

పెన్షన్‌ సొమ్ముల కోసం వృద్ధులు మండుటెండల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం కూడా బ్యాంకుల రద్దీ తగ్గక వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడ్డారు.

ఈ వయసులో ఏడిపిస్తారా !
పోలవరం స్టేట్‌ బ్యాంకులో రద్దీ

పింఛన్‌ లబ్ధిదారుల ఆవేదన

బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు..

గంటల తరబడి అవస్థ

మండుటెండల్లో వృద్ధుల పాట్లు

పెన్షన్‌ సొమ్ముల కోసం వృద్ధులు మండుటెండల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం కూడా బ్యాంకుల రద్దీ తగ్గక వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడ్డారు. క్యూలైన్లలో నిలబడి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఆపసోపాలు పడి పింఛను సొమ్ములు తీసుకున్నారు.ఇప్పటి వరకూ బ్యాంకు లావాదేవీలు చేయనివారు తమఖాతాలు రెన్యువల్‌ చేసుకోవాల్సి వచ్చింది. దానికి సర్వీసు చార్జీలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది.

బ్యాంకుల వద్ద ఆపసోపాలు

ద్వారకాతిరుమల : ఓపిక లేకపోయినా అవ్వా,తాతలు పెన్షన్‌ సొమ్ముకోసం బ్యాంక్‌ల వద్ద బారులు తీరుతున్నారు. ఎండ, ఉక్కబోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈకేవైసీ కాలేదని, ఆధార్‌ లింక్‌ కాలేదని ఇలా కొన్ని కారణాలతో కొందరికి పింఛను అందడం ఆలస్యం అయ్యింది. బ్యాంకుల్లో రద్దీ పెరగడంతో గంటల తరబడి వృద్ధులుు వేచి ఉండి పింఛను తీసుకుని ఆపసోపాలు పడుతూ ఇళ్లకు చేరకున్నారు.

అడవి బిడ్డలకు అవస్థలు

పోలవరం, మే 4 : పోలవరం మండలంలో గెడ్డపల్లి పంచాయతీ పాపి కొండల అభయారణ్యంలో ఉండడం వల్ల ఆ గ్రామం నుంచి సుమారు 30 కిలోమీటర్లు అడవిమార్గంలో ప్రయాణించి కన్నాపురం బ్యాంకు చేరు కోవ లసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇబ్బందులు పడి బ్యాంకుకు చేరినా ఖాతాలు రెన్యువల్‌ చేసుకోవాడానికి మళ్లీ స్వగ్రామాలకు వెళ్లి సోమవారం రావాలని బ్యాంకు అధికారులు సూచించడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. చేగొండపల్లి పంచాయతీ మెత్తప్పకోట, ఉడతపల్లి గ్రామాలు పోల వరం గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో పాపికొండల అభయార ణ్యంలో ఉన్నాయి.పది కిలోమీటర్లు కాలినడకన, పది కిలోమీటర్లు ఆటోలపై అదనపు చార్జీలు చెల్లించి బ్యాంకులకు చేరుకోవాలని గిరిజన వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో గ్రామాలైన కృష్ణారావుపేట, బంగారమ్మపేట, యడ్లగూడెం,కొత్తరామయ్యపేట గ్రామాల నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు, ఇటుకలకోట, వింజరం, చేగొండపల్లి, ప్రగడ పల్లి గ్రామాల నుంచి 12 కిలోమీటర్ల దూరం నుంచి, ఎల్‌ఎన్‌డీ పేట సమీ పంలో ఉన్న కోండ్రుకోట పునరావాస కాలనీ నుంచి 17 కిలోమీటర్ల దూరం నుంచి పోలవరం స్టేట్‌ బ్యాంకుకు చేరుకోవలసిన పరిస్థితులు నెల కొన్నాయి. మండుతున్న ఎండల్లో బ్యాంకుకు వెళ్లలేక ఇళ్ళకే పరిమితమ య్యారు. సొమ్ములు అవసరమైనవారు సమీపంలో ఉన్న ప్రైవేటు బ్యాంకు సేవా కేంద్రాల్లో కమీషన్లు వెచ్చించి పింఛను సొమ్ములు డ్రా చేసుకున్నారు.

మా బాధలు దేవుడికి తెలుసు..

ఇరగవరం : జగన్మోహన్‌రెడ్డి ఓట్ల కోసం మండు వేసవిలో తమ జీవి తాలతో ఆటలాడు కుంటున్నారని లబ్ధిదారులు మండిపడ్డారు. బ్యాంకులో జమచేసిన పింఛను సొమ్ము తీసుకోవడానికి మూడోరోజు శనివారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచే బ్యాంకుల వద్ద పడి గాపులు కాశారు.

పింఛన్‌ పంపిణీలో రాజకీయమా

కొల్లి చిట్టమ్మ, సజ్జాపురం

పింఛను తీసుకునేందుకు బ్యాంకు వద్దకు రెండుసార్లు వచ్చాను. రద్దీగా ఉండడంతో వెళ్లిపోయా.శనివారం పింఛను తీసుకున్నాను. గతంలో మాదిరిగా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి ఇస్తే మాకు ఈ ఇబ్బందులు ఉండేవి కాదు. మూడు కిలోమీటర్లు నడిచి వచ్చి పింఛను తీసుకున్నా. రాజకీయం చేసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు.

నిలబడే ఓపిక కూడా లేదు..

–ఒరగంటి పెద్దరాజు, పాతవూరు తణుకు

ఎక్కువసేపు నిలబడలేను..నిలబడితే కళ్లు తిరిగి ఆయాసం వస్తుంది. అయినా రెండు సార్లు సచివాలయానికి వెళ్తే బ్యాంకుకు వెళ్ళమని చెప్పారు. మా మనవడి సాయంతో బ్యాంకుకు వచ్చాను. లోపల పెద్ద లైన్‌ ఉండడం వలన అక్కడ ఉండలేక బయటకు వచ్చేశాను. బ్యాంకు ఖాతా వినియోగించి చాలా ఏళ్లు అవుఏతుంది. అధికారులు ఏమంటారో..?ఎప్పటికి ఇస్తారో తెలియదు. పింఛను తీసుకోవడానికి మేము పడే బాధలు దేవుడికే తెలుసు.

Updated Date - May 04 , 2024 | 11:51 PM