Share News

కైకలూరు కూటమిదే

ABN , Publish Date - May 04 , 2024 | 12:40 AM

‘ఈ దూలంకు ఎవరూ భయపడనక్కల్లేదు. ఎమ్మెల్యేగా కైకలూరు ను నిలువెత్తు దోచేశాడు. ఎమ్మెల్యేకు, ఆయన కొడుక్కి ఎందు కింత భయపడుతున్నారు.

కైకలూరు కూటమిదే
సభలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌, చిత్రంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్‌, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌, అంబటి రాయుడు తదితరులు

కొల్లేరు కాంటూరు కుదింపునకే ప్రాధాన్యత

ఆక్వాకు పూర్వ వైభవం..

ఎమ్మెల్యే దూలంకు భయపడనక్కర్లేదు

పర్యాటక శాఖ మంత్రి ఒక్కసారైనా వచ్చారా..

ఏలూరు/ కైకలూరు/నిడమర్రు, మే 3(ఆంధ్రజ్యోతి): ‘ఈ దూలంకు ఎవరూ భయపడనక్కల్లేదు. ఎమ్మెల్యేగా కైకలూరు ను నిలువెత్తు దోచేశాడు. ఎమ్మెల్యేకు, ఆయన కొడుక్కి ఎందు కింత భయపడుతున్నారు. కొల్లేరు స్థానికులను భయపెట్టి 50 ఎకరాలు దోచేసుకొన్నాడని ఇక్కడి వారు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఏమైనా దిగొచ్చాడా.. ఆయనకు ఎందుకు భయపడా లి మనం.. కైకలూరు వారి సొంతమా.. ఈ నేల వారి సొంత మా.. ఆంధ్రప్రదేశ్‌ జగన్‌ సొంతమా ఎందుకు భయపడాలి వాళ్లకి.. తన కుటుంబంతో నియోజకవర్గాన్ని దోచేసిన దూలం ను ఎన్నికల్లో తరిమికొట్టండి’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. కైకలూరులో శుక్రవారం కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రతి సగటు మనిషి నాతో సహా ఆరోగ్యం, తాగు, సాగు నీరు, బిడ్డల చదువు, ఉండడానికి గూడు కోరు కుంటారు. ఇవి ఇవ్వడానికే ప్రభుత్వాన్ని ఎన్నుకొంటారు. వైసీ పీ అధికారంలోకి వచ్చాక వాటిని ప్రజలకు అందివ్వలేదు. మన కార్మికులు ఎంతో కష్టపడి ఎన్నో భవంతులు కడతారు. ఆ భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టాడు ఈ జగన్‌. ప్రతి కట్టడానికి ఒక శాతం సెస్‌ కడతాం మనం. వారి సంక్షేమం కోసం వసూలు చేసే సెస్‌ సొమ్ము రూ.450 కోట్లు దోచేశాడు. కూటమి ప్రభుత్వం రాగానే వారి సంక్షేమం కోసం కృషి చేస్తాం. అలాగే అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిపికేషన్‌ ఇస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తాం. ప్రతి కుటుంబానికి ఏటా మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. రైతులకు రూ.20 వేలు అందిస్తాం. సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉత్తమమైన మార్గం చర్చించి నిర్ణయం తీసుకొంటాం. ప్రతి ఉద్యోగి రిటైర్‌మెంట్‌రోజున సంతోషంగా ఇంటికి వెళ్లాలే గానీ బాఽధపడుతూ వెళ్లకూడదు. వారికి రావాల్సిన టీఏ, డీఏ, ఎర్న్‌ లీవులు సకాలంలో ఒకటో తేదీన జీతాలు ఇస్తాం. ఆక్వా రంగానికి అన్యాయం చేశారు. దీనివల్ల వాటర్‌ పొల్యూషన్‌ అయితే రూ.150 కోట్లు పెట్టి ప్రాజెక్టు చేపడితే ఆ సమస్య పరిష్కారమవుతుంది. మత్స్యకారులకు వలలు ఇవ్వలేదు. ఇది మానివేసి జగన్‌ వైసీపీ రంగుల కోసం రూ.1300 కోట్లు, సాక్షి పేపరు కొనడానికి రూ.200 కోట్లు, ప్రకటనలకు రూ. 400 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. కొల్లేరు కాంటూరు సమస్య పరి ష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రంతో చర్చించగల సమర్థుడు కామినేని. ఆయనను ఎన్నుకోవాలి. కామినేని ఆరోగ్య మంత్రిగా ఉద్దానం సమస్యను పరిష్కరించారు. కొల్లేరును పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఒక్కసారైనా ఆ శాఖ మంత్రి వచ్చారా.. ఇదీ వారి పాలన. ఈ జగన్‌ పచ్చి అబద్ధాలకోరు. ఎమ్మెల్యేకైనా, జగన్‌ కైనా ఇదే చెబుతున్నా. మీ అవినీతి కోటలు బద్ధలు కొడతాం. జగన్‌ హయాంలో 7,300 కాలేజీలు మూసివేశారు. 30 వేల మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో అదృశ్యమయ్యారు. 25 వేల కిలో ల గంజాయి వైజాగ్‌ పోర్టులో దిగుమతి అయ్యింది. మన యువతను మత్తులో పెడుతున్నాడు. మీలో ధైర్యం నింపడాని కే వచ్చా.. భయంతో బతకొద్దు. ధైర్యంగా ముందుకు సాగండి.

నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తాం

నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తాం. కలిదిండిలో అగ్నిమాపక కేంద్రం, ముదినేపల్లిలో ధాన్యం గొడౌను, డిగ్రీ కళాశాల, కైకలూరులో ఈఐఎస్‌ ఆస్పత్రి, పార్కు, పీహెచ్‌సీ, డయాలిసిస్‌ యూనిట్‌, కలిసిపూడి రెగ్యులేటర్‌, కలిదిండిలో రైతు బజారు తదితర వాటిని ఏర్పాటుచేస్తాం. ఇందుకు నాదీ బాధ్యత. ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు కమలం గుర్తుపైన, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌కు సైకిలు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి’ అని పవన్‌ పిలుపు నిచ్చారు. జనసేన నాయకుడు, క్రికెటర్‌ అంబటి రాయుడు మాట్లాడుతూ వైసీపీకి అధికార దాహం ఎక్కువని, పవన్‌ కల్యాణ్‌పై నమ్మకంతో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

అవినీతి పాలనతో విసిగిపోయారు : కామినేని

డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘వైసీపీ పాలన లో అవినీతి, అరాచకాలతో కైకలూరు ప్రజలు విసిగిపోయా రు. ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించే విధంగా చేయ డమే లక్ష్యం. ఆక్వా పరిశ్రమతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కొల్లేరుకు శాశ్వత పరిష్కారంతోనే ఈ ప్రాంత ప్రజలు జీవనోపాఽధి పెరుగుతుంది. మంచి సమాజం కోసం కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలి’ అని కోరారు.

ఉద్యోగ, ఉపాధి కల్పనే కూటమి లక్ష్యం : పుట్టా

పుట్టా మహేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా, పరిశ్రమల స్థాపన జరగాలన్నా, ఉపా ఽధి, ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా కూటమి అభ్యర్థులను గెలిపించాలి. రైతులకు గిట్టుబాటు ధరలు, మహిళల ఆర్థికా భ్యున్నతి, సామాజిక వర్గాల వారీగా కల్యాణ మండపాల ఏర్పాటు, కొల్లేరు తదితర సమస్యలను పార్లమెంట్‌లో గళమె త్తుతా. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొంది స్తాం’ అంటూ స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బలే ఏసురాజు, పెన్మెత్స త్రినాథరాజు వీరమల్లు నరసింహారావు, బొమ్మనబోయిన విజయలక్ష్మీ, కొల్లి వరప్రసాద్‌, చలపతి, భట్టు లీలాకనకదుర్గ, తోట లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

పుట్టాకు పవన్‌ ప్రశంసలు

ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ ఎంతో

ఉన్నతమైన వ్యక్తి అని జనసేనాని పవన్‌కల్యాణ్‌ కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోలవరం నిర్వాసితుల కోసం 33 వేల కోట్ల నిధులు కావాలని, తన వంతు సాయంగా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించగా, అదే సభలో మహేష్‌ తాను రూ.కోటి విరాళమందిస్తానని ప్రకటించాడని పవన్‌ కొనియాడారు.

ఓట్లు చీల్చడానికే స్వతంత్రులకు గ్లాసు గుర్తు

కూటమి ఒప్పందాల్లో భాగంగా కైకలూరును బీజేపీకి కేటాయించాం. జగన్‌ కుట్రతో కూటమిలో జనసేన పోటీ చేయనిచోట ఓట్లు చీల్చడానికి స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసును కేటాయించారు. ఈ కుట్రను గమనించి కైకలూరు లో కమలం గుర్తుకు ఓటేయాలి.

Updated Date - May 04 , 2024 | 12:40 AM