Share News

ఎన్నికల స్ర్టాంగ్‌రూమ్‌ పరిశీలన

ABN , Publish Date - May 04 , 2024 | 11:41 PM

సార్వత్రిక ఎన్నికల నిర్వహ ణలో భాగంగా శనివారం కోట రామచంద్రపురం పోలవరం ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూమ్‌ను సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎస్‌.ఎ.రామన్‌, జిల్లా ఎన్నికల పోలీసు పరిశీలకులు టి.శ్రీధర్‌ కలిసి పరిశీలించారు.

ఎన్నికల స్ర్టాంగ్‌రూమ్‌ పరిశీలన
కేఆర్‌పురంలో స్ర్టాంగ్‌ రూమ్‌ ఏర్పాట్లు పరిశీలిస్తున్న ప్రత్యేక అధికారి రామన్‌

బుట్టాయగూడెం, మే 4 :సార్వత్రిక ఎన్నికల నిర్వహ ణలో భాగంగా శనివారం కోట రామచంద్రపురం పోలవరం ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూమ్‌ను సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎస్‌.ఎ.రామన్‌, జిల్లా ఎన్నికల పోలీసు పరిశీలకులు టి.శ్రీధర్‌ కలిసి పరిశీలించారు. నియోజకవర్గ కేంద్రాల వారీగా ఈవీఎంల కేటాయింపు, పోలింగ్‌ కేంద్రాలకు తరలించే విధానం, ఈవీఎంలు, వీవీ ఫ్యాట్‌లు భద్రపరిచే భద్రతా ఏర్పాట్లను అధికారులు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎం.సూర్యతేజతో కలిసి పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాలకు తరలించే రూట్‌ మ్యాప్‌ను, భద్రత తదితర అంశాలపై తగిన ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్‌ అధికారిని ఆదేశించారు. ఏఆర్‌వో ప్రసాద్‌, ఏపీవో నాయుడు తదితరులు ఉన్నారు. అనంతరం ఐటీడీఏలో జరుగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిసిటేషన్‌ సెంటర్‌ను అధికారులు పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓటింగ్‌ సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:41 PM