Share News

సీఎం సభ తుస్‌

ABN , Publish Date - May 04 , 2024 | 12:27 AM

సీఎం వైఎస్‌ జగన్‌ నరసాపురం పర్యటన తీరప్రాంతవాసులను తీవ్ర నిరుత్సాహ పర్చింది.

సీఎం సభ తుస్‌
నరసాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతుండగా వెళ్లిపోతున్న జనం

మాట్లాడుతుండగానే జనం తిరుగుముఖం

హామీలు లేవ్‌.. పాత ప్రాజెక్టు పనుల ఊసేలేదు.. చప్పగా సాగిన జగన్‌ ప్రసంగం

మండే ఎండలో జనానికి నరకం

తాగేందుకు నీళ్లు లేక విలవిల

అడుగడుగునా ట్రాఫిక్‌ ఆంక్షలు

దుకాణాల బంద్‌.. వాహనదారుల ఇక్కట్లు

నరసాపురం/నరసాపురం టౌన్‌, మే 3: సీఎం వైఎస్‌ జగన్‌ నరసాపురం పర్యటన తీరప్రాంతవాసులను తీవ్ర నిరుత్సాహ పర్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు నరసాపురం చేరుకుని 12 గంట లకు తిరిగి వెళ్లాలి. అనుకున్న సమయానికి వస్తారని భావిం చిన పార్టీ నాయకత్వం ఉదయం ఎనిమిది గంటల నుంచే జనాన్ని సమీకరించారు. వేదికను స్టీమర్‌ రోడ్‌లో ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చునేందుకు సరైన వసతులు లేవు. మార్కెట్‌లో దుకాణాలన్ని మూయించి వేయడంతో షాపుల అరుగుల వద్ద ఎండ వేడికి తలదాచుకు న్నారు. తాగేందుకు నీళ్లు కూడా అందించలేకపోయారు. ఈ కారణంగా మహిళలు నానా ఇబ్బందులు పడ్డారు. అత్యవసరాలకు ఆర్టీసీ బస్టాండ్‌ ను ఆశ్రయించారు. సీఎం సభ 12 గంటలకు ప్రారంభం కావ డంతో నలుదిక్కుల తలదాచుకున్న జనం వేదిక వద్దకు చేరు కున్నారు. అప్పటికే నీరసించిన ప్రజలు సీఎం ప్రసంగం మొద లుపెట్టగానే ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. నీడ కూడా లేకపోవడంతో ఎండలో నిలబడలేకపోయారు. దీంతో మహిళ లు వెనుదిరగడం మొదలుపెట్టారు. అదే బాటలో వచ్చిన జనం మెల్లగా జారుకోవడం ప్రారంభించారు. దీనిని గమనిం చిన పార్టీ నేతలు సభా ప్రాంగణం చివరిలో ఉండి వీరిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఎండకు తట్టుకోలే వెళ్లిపోతా మంటూ జారుకున్నారు. జనం వెళ్లిపోవడం గమనించిన సీఎం కూడా తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు.

అడుగడుగునా ఆంక్షలు

సీఎం పర్యటనతో ఉదయం నుంచి పట్టణంలో అడుగడు గునా ఆంక్షలు పెట్టారు. హెలీక్యాప్టర్‌లో వచ్చిన సీఎం టైలర్‌ హైస్కూల్‌ మైదానంలో దిగి, అక్కడి నుంచి స్టీమర్‌ రోడ్‌కు చేరుకున్నారు. మెయిన్‌రోడ్‌కు వచ్చే రహదార్లపై ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు, వీధి చివర్లో బారికేట్లు కట్టారు. ఈ కారణం గా మార్కెట్‌, ఆస్పత్రులకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వచ్చిన జనం కూడా చాలా మంది బైక్‌లపై వచ్చి వాటిని పట్టణంలో ఎక్కడబడితే అక్కడ పార్కింగ్‌ చేశారు. దీంతో రోడ్లన్ని వాహనాలతో నిండిపోయి అడుగడుగు నా ట్రాఫిక్‌ ఇబ్బంది ఏర్పడింది. మొగల్తూరు వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.

కనిపించని ముఖ్య నేతలు

సీఎం పర్యటనలో జిల్లాకు చెందిన ముఖ్య నేతలెవరూ కనిపించలేదు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, కవురు శ్రీనివాస్‌, నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ముదునూరి ప్రసాదరాజు, గుడాల గోపి మాత్రమే కనిపించారు. జిల్లాలో పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థులు ఎవరూ సీఎంను కలిసేందుకు రాలేదు. అడుగడుగునా పోలీసు బందోబస్తు కనిపించింది. హెలిప్యాడ్‌ వద్ద అన్ని రహదారుల కూడళ్లలోను, సీఎం సభ జరుగుతుం డగా అన్ని షాపులపైన, మాధవాయిపాలెం రేవుల్లోను పోలీసు లు ఎక్కువగా కనిపించారు. ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండటంతో సభావేదిక వద్దకు వచ్చిన జనం తిరిగి బయటకు వచ్చేందుకు నానా ఇబ్బందులు పడ్డారు.

పాత పనులపై స్పష్టత లేదు

సీఎం గతంలో రూ.3,200 కోట్ల విలువైన పనులకు శంకు స్థాపన చేశారు. వీటిలో వశిష్ట వారధి, హార్బర్‌, ఆక్వా యూని వర్సిటీ, వాటర్‌గ్రిడ్‌, రెగ్యులేటర్‌, సబ్‌స్టేషన్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వంటి పనులు ఉన్నాయి. వీటిలో ఆక్వా యూనివర్సిటీ మినహా ఏ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. వీటిపై సీఎం మాట్లాడతారని ప్రజలు ఆశతో ఎదురు చూశారు. కనీసం వాటి ప్రస్తావనే రాలేదు. పెండింగ్‌లో సమస్యలపై నోరు విప్పలేదు. దీంతో చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు.

Updated Date - May 04 , 2024 | 12:27 AM