Share News

ఎక్సైజ్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌

ABN , Publish Date - May 04 , 2024 | 11:53 PM

ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు సీఐ వి.రవికుమార్‌ తెలిపారు.

 ఎక్సైజ్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌

పార్వతీపురం టౌన్‌, మే 4 : ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు సీఐ వి.రవికుమార్‌ తెలిపారు. శనివారం స్థానిక ఎక్సైజ్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం అక్రమ రవాణా, అమ్మకాలపై ఈ నెంబర్లకు 93926 79980, 85009 00923 ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. జిల్లాలోని 53 ప్రభుత్వ మద్యం షాపులు, 8 బార్లలో అమ్మకాల పరిమితులను సీసీ టీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల నిర్వహించిన దాడుల్లో భాగంగా మద్యం అక్రమ రవాణా కేసుల్లో 8మంది పై 5 కేసులను నమోదు చేశామన్నారు. నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 46 వేల విలువల గల మద్యం సీసాలతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామని వివరించారు. మద్యం షాపుల్లో పనిచేసిన సూపర్‌ వైజర్‌తో పాటు నలుగురు సేల్స్‌మేన్‌లను విధుల నుంచి తొలగించామని తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ పరిధిలో అక్రమ మద్యం, రవాణా, అమ్మకాలపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - May 04 , 2024 | 11:53 PM