Share News

రానున్నది కూటమి ప్రభుత్వమే

ABN , Publish Date - May 05 , 2024 | 12:03 AM

రానున్నది కూటమి ప్రభుత్వమేనని కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు.

రానున్నది కూటమి ప్రభుత్వమే

సీతంపేట: రానున్నది కూటమి ప్రభుత్వమేనని కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. కొండాడ పంచాయతీ ఇస్పరాయికి చెందిన 35 కుటుంబాలు శనివారం వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరారు. వీరందరికీ ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. సవర రాజ్‌కుమార్‌, సవర సింగన్న, సవర సూరయ్య, సవర తోటయ్య, తదితరులు పాల్గొన్నారు.

కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గెలుపునకు కార్యకర్తలంతా కృషి చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి పిలుపుని చ్చారు. ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతతో కలిసి ఆమె శనివారం ప్రచారం నిర్వహించారు. శీలగాం, మల్లి, కుశిమి, ముత్యాలు, కోడిశ, శంభాం, తొత్తడి, సీతంపేట, హడ్డుబంగి తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. కూటమి నాయకులు వారాడ సుమంత్‌నాయుడు, గండి రామినాయుడు, పూడి తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

భామిని: కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. దిమ్మిడిజోలలో ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మణిగ సర్పంచ్‌ కొండగొర్రె మంగ, భర్త చంటితో పాటు 36 మంది జనసేనలో చేరారు. దిమ్మిడిజోల సర్పంచ్‌ వలరౌతు రజని టీడీపీ కండువా వేసుకోగా, భర్త రామారావు జనసేన కండువా వేసుకుని 56 మంది పార్టీలో చేరారు. టీడీపీ పాలకొండ ఎన్నికల పరిశీలకులు కలమట సాగర్‌, జగదీశ్వరరావు సమక్షంలో 25 మంది పార్టీలో చేరారు. పాలవలస మాజీ సర్పంచ్‌ పత్తిక సుధతో పాటు మరో నాలుగు కుటుంబాలు జనసేనలో చేరాయి. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత.. భామిని, బిల్లుమడ గ్రామాల్లో పర్యటించి, ఎన్నికల ప్రణాళికలపై కూటమి నాయకులతో చర్చించారు.

పాలకొండ: కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతలను గెలిపించాలని బీజేపీ నాయకులు శనివారం వాటపాగు, అట్టలి గ్రామాల్లో ప్రచారం చేశారు.

Updated Date - May 05 , 2024 | 12:03 AM