Share News

పదండి..పదండి.. ఇంకా వారం రోజులే

ABN , Publish Date - May 03 , 2024 | 11:41 PM

ఎన్నికల ప్రచారానికి ఇంకా వారంరోజులే మిగిలిఉంది. సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు ప్రచా రంలో స్పీడ్‌పెంచాయి. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించడంతో వాటిని అభ్యర్థులు ప్రజలకు వివరిస్తూ తమకు ఓటువేయాలని కోరుతున్నారు. మేనిఫెస్టోలోని హామీలతో పాటు స్థానికంగా ఉండే సమస్యలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని ముందుకుసాగు తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టో జనరంజకంగా ఉండడంతో అభ్యర్థులు ప్రచా రంలో మరింత ఉత్సాహంతో అడుగులేస్తుండగా, వైసీపీ మేనిఫెస్టో పేలవంగా ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థులు డీలా పడుతున్నారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు జరిగిన విధ్వంసంపైనే టీడీపీ నాయకులు ప్రధానంగా ఫోకస్‌ పెట్టి ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం విజయావ కాశాలు కూటమికే ఉన్నాయని విశ్లేషణలొస్తుండడంతో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. వారిని ఆపడానికి వైసీపీ నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. కూటమి మేనిఫెస్టోలో కీలకమైన ఏటా నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు నిరుద్యోగ భృతి వంటి అంశాలపై అభ్యర్థులు దృష్టిసారించారు. ఇవే కాకుండా చంద్రబాబుకు ఉన్న ఐటీ బ్రాండ్‌ను కూడా అభ్యర్థులు లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు.

   పదండి..పదండి.. ఇంకా వారం రోజులే

(నరసన్నపేట)

పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు

అభ్యర్థులు పగలంతా ప్రచారం చేస్తున్నారు. రాత్రి చేరికలు తదితర అంశాలపై మంత నాలు సాగిస్తున్నారు. బూత్‌లవారీగా సమీక్షలతో పార్టీకార్యాలయాలు, అభ్యర్థులు ఇళ్లు జాతరను తలపిస్తున్నాయి. మధ్యమధ్యలో ప్రధాన పార్టీల తరపున రాష్ట్రస్థాయి నాయకులు ప్ర చారానికి వచ్చి వెళ్తుండంతో ఆయా పార్టీల శ్రేణుల్లో గెలుపు ధీమా మరింత పెరుగుతోంది.

కూటమి అధికారంలోకి వస్తే..

ఏళ్లుగా పరిష్కారం లభించని అనేక సమస్యలకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గాడినపెడతామని కూటమినాయకులు హామీ ఇస్తున్నారు. కొద్దిరోజుల కిందట వరకు పార్టీ అభ్యర్తి మాత్రమే ప్రచారం చేసేవారు. ప్రస్తుతం సమయం దగ్గర పడతుండడంతో పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులకు గ్రామాల వారీగా ప్రచార బాధ్య తలను అప్పటించారు. ప్రచా రంలో భాగంగా ఇప్పటివరకు టచ్‌చేయని ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు, ప్రతి కూలతఉన్న ప్రాంతాల్లో ఇకమీదట ఎక్కువగా ప్రచారం చేయాలని నాయకులు అంచనాకు వచ్చారు. పార్టీ తరపున నియోజవర్గాల్లో ఉన్న పరిశీలకుల సూచనలు, సలహాలు కూడా పాటిస్తూ అభ్యర్థులు దూకుడుపెంచారు.

సోషల్‌ మీడియాపైనా దృష్టి..

సమయం తక్కువగా ఉండడంతో కోడ్‌ నిబంధనలు మేరకు సోషల్‌ మీడియాలో ప్రచారంపై కూడా నాయకులు దృష్టి సారించారు. వారి ఖాతాలను నిర్వహించడానికి ప్ర త్యేకంగా ఓబృందాన్ని కొంతమంది అభ్యర్థులు ఏర్పాటుచేసుకున్నారు. సోషల్‌మీడియాలో ఎక్కువగా యువతను ఆకట్టుకునే అంశాలపై దృష్టి సారించారు.

విధ్యంసం, అరాచకాలను గుర్తు చేస్తూ...

ఐదేళ్ల పాలనలో అధికారపార్టీ చేసిన విధ్వంసంతో పాటు అరాచకాలను గుర్తు చేస్తూ కూటమి అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. అరకొరగా అమలు చేసిన సంక్షేమ పథకా లను నమ్ముకుని వైసీపీ అభ్యర్థులు ఓటర్ల ముందుకు వెళ్తున్నారు. గతంలో సామాన్యులతో పాటు వ్యాపార వర్గాలను భయభ్రాంతులకు గురిచేసిన సందర్భాలు, ప్రజాకట్టడాలు కూల్చే వేసిన సంఘటనలను ప్రజల్లో మరోసారి చర్చకు పెడుతూ కూటమి అధికార ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు.

ముఖ్యనేతల తాకిడి..

ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ జిల్లాలకు ప్రచారానికి వచ్చే రాష్ట్రస్థాయి నేతల తాకిడి ఎక్కువైంది. ఇటీవల సీఎం జగన్మోహానరెడ్డి టెక్కలిలో పర్యటించగా, పాతపట్నం, ఆమదా లవలస, శ్రీకాకుళంలో చంద్రబాబు ప్రజాగళం, మహిళలతో సమావేశం నిర్వహించారు. తాజాగా జిల్లాలో నారా లోకేష్‌ ప్రచారం చేపట్టనున్నారు. కాగా ఈవారంలో మళ్లీ చంద్రబా బునాయుడు జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

కూడికలు, తీసివేతలతో బిజీబిజీ..

అభ్యర్థులు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. వారి వారి పార్టీలు నియోజకవర్గాల వారీగా నియమించిన పరిశీలకులు పంచాయతీలు, బూత్‌లు వారీ బలాబలాలను లెక్కలు వేస్తున్నారు. ప్రతిరోజూ నియోజవర్గంలో పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి నివేదిక ఇస్తున్నారు. పరిశీలకులు అభ్యర్థులతో సమానంగా పనిచేస్తూ వారి గెలుపు కోసం తెరవెనుక వ్యూహాలు రచించే పనిలో నిమగ్నమయ్యారు.

Updated Date - May 03 , 2024 | 11:44 PM