Share News

పల్లెల ముఖం చూడని ఆర్టీసీ సర్వీసులు

ABN , Publish Date - May 03 , 2024 | 11:39 PM

ఆదాయం ముఖ్యం కాదు ప్రజారవాణా ముఖ్యం. మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొత్త సర్వీసులు దేవుడెరుగు ఉన్న బస్సులను సర్కారు నిలిపివేస్తోంది. రోడ్డు సదుపాయం ఉన్న గ్రామాలకు కూడా బస్సులు నడపడం లేదు. ఫలితంగా బస్సు ముఖం చూడని పల్లెలు ఎన్నో ఉన్నాయి. దీంతో ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడడడంతో పాటు వారి జేబులకు చిల్లు కూడా పడుతోంది. ఇది రాష్ట్ర సర్కారు నిర్లిప్తతకు అద్దంపడుతోంది.

పల్లెల ముఖం చూడని ఆర్టీసీ సర్వీసులు
ఆటోలో వెళ్తున్న ప్రయాణికులు

ఆదాయం ముఖ్యం కాదు ప్రజారవాణా ముఖ్యం. మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొత్త సర్వీసులు దేవుడెరుగు ఉన్న బస్సులను సర్కారు నిలిపివేస్తోంది. రోడ్డు సదుపాయం ఉన్న గ్రామాలకు కూడా బస్సులు నడపడం లేదు. ఫలితంగా బస్సు ముఖం చూడని పల్లెలు ఎన్నో ఉన్నాయి. దీంతో ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడడడంతో పాటు వారి జేబులకు చిల్లు కూడా పడుతోంది. ఇది రాష్ట్ర సర్కారు నిర్లిప్తతకు అద్దంపడుతోంది.

(నందిగాం)

జిల్లాలోనే ఎక్కువ భాగం జాతీయ రహదారి-16 నందిగాం మండలంలోనే ఉంది. ఈ మండలం మధ్యగుండానే హైవే వెళ్తోంది. చాలా గ్రామాలకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రూ.కోట్లు ఖర్చుచేసి రహదారులు నిర్మించారు. అయితే, ఈ రూట్లలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. కొన్నిచోట్ల జాతీయ రహదారి నుంచి లింకురోడ్లు నిర్మించ కపోవడంతో ఆర్టీసీ బస్సులు రావడం లేదు. దీంతో గ్రామీణ, కొండల ప్రాంత ప్రజలు ప్రైవేట్‌ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. అధిక చార్జీలు చెల్లించి పలాస, టెక్కలి తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించాల్సి వస్తోందని వాపోతున్నారు. మండల కేంద్రం నందిగాంలో తప్ప ఎక్కడా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నిలపడం లేదని, దీనివల్ల విశాఖ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు అగచాట్లకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

ఆటోలపైనే ఆధారం..

ఫ నందిగాం-పూండి, నరేంద్రపురం- వల్లభరాయుడుపేట, పెంటూరు - పొల్లాడ వయా శివరాంపురం జాతీయరహదారి నుంచి జల్లపల్లి వయా దేవళభద్ర, జాతీయరహదారి - రాంపురం వయా సొంటినూరు తదితర కూడళ్ల నుంచి పక్కా రహదారులను టీడీపీ హయాంలో నిర్మించారు. కానీ, ఆర్టీసీ బస్సులు మాత్రం తిరగడం లేదు. దీంతో ఈ గ్రామాలకు ఆటోలే దిక్కుగా మారాయి.

ఫ జాతీయ రహదారి నుంచి బడగాం-సవరలింగుపురం ఎనిమిది కిలోమీటర్లు మేర పక్కా రహదారి సౌకర్యం కల్పించారు. ఈ మార్గంలో కాశీరాజుకాశిపురం, బడగాం, సవర బడగాం, మొగిలిపాడు, సవరలింగుపురం గ్రామాలకు చెందిన 3వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. అయినా ఆర్టీసీ బస్సులు మాత్రం నడపడం లేదు.

ఫ దశాబ్దాలుగా నిర్మాణానికి నోచుకోని కాపుతెంబూరు-హకుంపేట రహదారి టీడీపీ హయాంలోనే పూర్తిచేశారు. నాలుగు కిలోమీటర్ల మార్గంలో సింగుపురం, గోపాలపురం తదితర గ్రామాలకు చెందిన 3వేల వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. బస్సులు లేకపోవడంతో ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

ఫ తురకలకోట జాతీయ రహదారి నుంచి బోరకుభద్ర, వెంకన్న పేట, మాదిగాపురం నుంచి హరిదాపురం, ఆనందపురం ఐదు కిలో మీటర్లు రహదారిని టీడీపీ పాలనలోనే పూర్తి చేశారు. దశాబ్దాలుగా మట్టిరోడ్లుగా ఉండే ఈ మార్గంలో బీటీరోడ్డు వేసి జాతీయ రహదారికి అనుసంధానం చేశారు. అయితే ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించకపోవడంతో 4 వేలమంది ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు.

ఫ టీడీపీ హయాంలో పలు కీలక గ్రామాలకు పక్కా రహదారి సౌకర్యం కల్పించారు. అప్పట్లో టెక్కలి డిపో నుంచి వల్లభరాయుడుపాడు తదితర గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు అవస్థలు తప్పేవి. అయితే, వల్లభరాయుడుపాడు, జల్లపల్లి తదితర సర్వీసులను కరోనా సమయంలో రద్దు చేసి నేటికీ కూడా పునరుద్ధరించలేదు. ఆర్టీసీ సేవలు నిలిపివేయడంతో ఆయా గ్రామాల నుంచి జాతీయ రహదారికి ఆటోల్లో చేరుకుని అక్కడి నుంచి పలాస, టెక్కలి వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.

ఫ కరోనా తర్వాత ప్రైవేటు వాహనాల ఆపరేటర్లు చార్జీలు భారీగా పెంచేశారని విద్యార్థులు, మహిళలు చెబుతున్నారు. రోజుకు రూ. 50 వరకు చార్జీలకు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.

ముఖ్యనేతల పర్యటనలకే బస్సులు..

ఎన్నికల సమయంలో, ముఖ్యనేతల పర్యటనల సందర్భాల్లో ఆర్టీసీ బస్సులను టెక్కలి, పలాస డిపోల నుంచి జనసమీకరణకు వినియోగి స్తున్నారు. జిల్లా, నియోజకవర్గ, జోనల్‌ స్థాయిలో జరిగే సభలు, సదస్సులకు అవసరమయ్యే జనసమీకరణ కోసం మారుమూల పల్లెలకు సైతం ఆర్టీసీ బస్సులను పంపిస్తున్నారని, కానీ, తమ అవసరాల కోసం ఎందుకు సర్వీసులు నడపడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ రూట్లల్లో ఆర్టీసీబస్సులు లేకపోవడంతో విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు.

ప్రైవేటు వాహనాలపైనే ఆధారం

కంచిలి: అని ఉన్నా అల్లు డి నోట్లో శని అన్న చందంగా కంచిలి మండలం లో పలు గ్రామాల ప్రజల పరి స్థితి తయారైంది. గ్రామాలకు చేరు కోవడానికి రోడ్డు సౌకర్యం ఉన్నా ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఆ సంస్థ ముందుకు రావడం లేదు. రహదారులు ఉన్న ప్రతి గ్రామానికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ముందు వైసీపీ నాయకులు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. గతంలో సోంపేటలో ఉండే సబ్‌డిపో ను సైతం ఎత్తేశారు. దీంతో పూర్తిగా అన్ని సర్వీసులు పలాస డిపో నుంచే నిర్వహించాల్సి వస్తోంది. డిపో పరిధి ఎక్కువ కావడం, పూర్తిగా గ్రామీణ రూట్లు కావడంతో ఆదాయం లేదని షాకుతో సర్వీసులు నిలిపి వేస్తున్నారు.

రోడ్లు నిర్మించినా..

కంచిలి నుంచి సుమారు 30 పంచాయతీలకు పూర్తిస్థాయిలో రహదారి సౌకర్యం ఉన్నా ఆర్టీసీ సేవలను ఆ సంస్థ ప్రారంభించడం లేదు. గతంలో రహదారులు లేవని, ఆక్యుపెన్సీ లేదని ఆ సంస్థ అధికారులు బస్సులు నడిపేందుకు ముందుకువచ్చే వారు కాదు. టీడీపీ హయాంలో కంచిలికి సుదూరంగా ఉన్న గిరిజన, మైదాన గ్రామాలకు సైతం పూర్తిస్థాయిలో తారురోడ్లు నిర్మించారు. అయినా వైసీపీ ప్రభుత్వం నువాగుడ, కొనక, గంగాధరపురం, భైరిపురం, జలంత్రకోట, గోకర్ణపురం, శాసనాం, ఉద్దానంలోని పెద్దశ్రీరాంపురం, పెద్దకొజ్జిరియా తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించ లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆటోలు, ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆపరేటర్లు ఎక్కువ చార్జీలువసూలు చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు.

ఫ కంచిలికి సుదూరంలో ఉన్న ఎంఎస్‌పల్లి, గంగాధరపురం గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నా, అరకొరగానే సేవలు అందుతున్నాయని ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు వాపోతున్నారు. ఉదయం, సాయంత్రం ఒకసారి మాత్రమే బస్సులు నడుపుతున్నారు.

ఫ సోంపేట నుంచి తలంతపరం, మాణిక్యపురం మీదుగా పెద్దశ్రీరాంపురం బస్సు సర్వీసు గతంలో రెండుసార్లు తిరిగేది. ప్రస్తుతం ఒక సారి మాత్రమే నడుస్తోంది. దీంతో ఈ రూట్‌లోని గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులు కొన్నిసార్లు కాలినడకన గమ్యస్థానాలకు చేరుకోవల్సి వస్తోంది.

ఫ జలంత్రకోట పంచాయతీ పరిధిలోని నువ్వాగడ, పరిసర గ్రామాలకు సైతం బస్సు సర్వీసులు లేక విద్యార్థులు సకాలంలో కళాశాలలకు చేరుకోలేకపోతున్నారు. కె..శాసనం, గోక ర్ణపురం, బూరగాం, కుత్తమ, కత్తివరం గ్రామాలకు బస్సు సౌకర్యంలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రైవేటు వాహనాలకు ఆశ్రయించాల్సి వస్తోంది.

ఫ ఆర్టీసీ సర్వీసులు అరకొరగా నడుస్తుండడంతో అత్యసవర సయమాల్లో అవస్థలు తప్పడంలేదు. మారుమాల గ్రామాల నుంచి కంచిలి చేరుకోవ డానికి గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.

ఫ బొగాబెణి, జెన్నాఘయి, నువ్వాగడ తదితర గిరిజన గ్రామాలు, కాలనీలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. కొందరు ఆటో డ్రైవర్లు ప్రమాదమని తెలిసినా ముందు, వెనుకభాగంలో ప్రయాణికులను వేలాడేలా ఎక్కించి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.

ఫ సోంపేట నుంచి ఇచ్ఛాపురం, బరంపురం వైపు వెళ్లే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు కంచిలిలోకి రాకుండా బైపాస్‌ నుంచి వెళ్లిపోతున్నాయి. బరంపురం వైపు నుంచి సోంపేట, విశాఖపట్నం వైపు వెళ్లే ఆర్టీసీ సర్వీసులు సైతం కంచిలి రాకపోవడంతో ప్రయాణికులంతా సోంపేట వెళ్లి బస్సులు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో రెండు మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌లు కంచిలి వచ్చే హైవే మీదుగా వెళ్లేవి. ప్రస్తుతం కంచిలిలోకి రాకుండా వెళ్లిపోతుండడంతో 30 పంచాయతీల ప్రయాణికులు అగచాట్లకు గురవుతున్నారు.

పెంటూరు, పొల్లాడ వయా శివరాంపురం రహదారిపై

Updated Date - May 03 , 2024 | 11:39 PM