Share News

ఎంత పనున్నా.. ఆ రోజు రావాల్సిందే

ABN , Publish Date - May 03 , 2024 | 11:48 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా కనిపించే ఈ దృశ్యాలే ప్రస్తుతం సార్వ త్రిక ఎన్నికల్లో సైతం కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మన అభ్యర్థిని తప్పనిసరిగా మనందరం కలిసి గెలిపించుకోవాలి. మీకు ఎంత పనిఉన్నా ఓటు వేసే సమయానికి మాత్రం ఊరులో ఉండాల్సిందేనని పట్టణాలు, గ్రామాల్లో ఉన్న ఓటర్లను వివిధ పార్టీల కు చెందిన నాయకులు ఫోన్‌చేసి సమాయత్తం చేస్తున్నారు. ఫోన్లు కలవకపో తే మెసేజ్‌ల రూపంలో పిలుస్తున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకు వెళ్లి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి పట్టణాల్లోని వలస ఓటర్లపై దృష్టిసారించారు. వారికి రానుపోను చార్జీలు తామే భరి స్తూ.. ఫోన్‌పే, గూగుల్‌పేలో డబ్బు చెల్లించి రప్పిస్తున్నారు. ఈసారి ఇరుపార్టీల మధ్య ఎన్నికలు హోరాహోరిగా జరుగుతుండడంతో ప్రతి ఓటు కీలకంకావ డంతో ఆయా పార్టీల కిందస్థాయి నాయకులు వలస ఓటర్లను రప్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్నారు.

ఎంత పనున్నా..  ఆ రోజు రావాల్సిందే

హరిపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా కనిపించే ఈ దృశ్యాలే ప్రస్తుతం సార్వ త్రిక ఎన్నికల్లో సైతం కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మన అభ్యర్థిని తప్పనిసరిగా మనందరం కలిసి గెలిపించుకోవాలి. మీకు ఎంత పనిఉన్నా ఓటు వేసే సమయానికి మాత్రం ఊరులో ఉండాల్సిందేనని పట్టణాలు, గ్రామాల్లో ఉన్న ఓటర్లను వివిధ పార్టీల కు చెందిన నాయకులు ఫోన్‌చేసి సమాయత్తం చేస్తున్నారు. ఫోన్లు కలవకపో తే మెసేజ్‌ల రూపంలో పిలుస్తున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకు వెళ్లి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి పట్టణాల్లోని వలస ఓటర్లపై దృష్టిసారించారు. వారికి రానుపోను చార్జీలు తామే భరి స్తూ.. ఫోన్‌పే, గూగుల్‌పేలో డబ్బు చెల్లించి రప్పిస్తున్నారు. ఈసారి ఇరుపార్టీల మధ్య ఎన్నికలు హోరాహోరిగా జరుగుతుండడంతో ప్రతి ఓటు కీలకంకావ డంతో ఆయా పార్టీల కిందస్థాయి నాయకులు వలస ఓటర్లను రప్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:48 PM